https://oktelugu.com/

ఇఎస్ఐ స్కామ్ పై బాబు నోరు విప్పరే..!

ఇఎస్ఐ స్కామ్ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంత వరకూ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ స్కామ్ లో కార్మిక శాఖ మాజీ మంత్రి, మరో ఇద్దరు ఉన్నతాధికారులను నిన్న అరెస్ట్ చేయగా, మరో 16 మందిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసులు నమోదు చేసింది. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన వ్యక్తిని అరెస్టు చేయడం, […]

Written By: , Updated On : June 13, 2020 / 11:00 AM IST
Follow us on


ఇఎస్ఐ స్కామ్ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంత వరకూ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ స్కామ్ లో కార్మిక శాఖ మాజీ మంత్రి, మరో ఇద్దరు ఉన్నతాధికారులను నిన్న అరెస్ట్ చేయగా, మరో 16 మందిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసులు నమోదు చేసింది. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన వ్యక్తిని అరెస్టు చేయడం, అందునా అవినీతి కేసులో అదే ప్రథమం కావడంతో అచ్చెన్నాయుడి అరెస్టు చర్చనీయాంశంగా మారింది.

అరెస్టు జరిగిన వెంటనే శుక్రవారం ఉదయం, సాయంత్రం రెండు పర్యాయాలు వీడియో కాన్ఫెరెన్స్ లు నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇఎస్ఐ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో 50 నిముషాలకుపైగా బాబు ప్రసంగించారు. ఈ సమయంలో స్కామ్ జరిగింది, లేనిది వెల్లడిస్తారని ప్రజలు ఎదురు చూశారు. కానీ స్కామ్ గురించిన ఊసే ప్రసంగంలో లేదు. అచ్చెన్నాయుడు అరెస్టును గురించి బీసీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వివిధ అంశాలలో ప్రభుత్వా విధానాలను తప్పు బట్టడం, అన్ని పార్టీలు ఈ అంశంలో పోరాటానికి కలిసి రావాలని కోరడం వంటి అంశాలనే ఆయన ప్రస్తావించారు.

మరోవైపు చంద్రబాబు తనయుడు లోకేష్ ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారనే చర్చ జరుగుతున్న క్రమంలో చంద్రబాబు మౌనం ఈ వాదనలు ఉతమిచ్చేలా ఉంది. తనయుణ్ని రక్షించుకునేందుకు చంద్రబాబు బీసీ కార్డు ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు చర్చ జరుగుతుంది. అందుకే ఈ అంశాన్ని ఇంత రచ్చ చేయడానికి ప్రయత్నిస్తున్నారని వాదనలు లేకపోలేదు. టీడీపీ సోషల్ మీడియా విభాగం ఇప్పటికే బీసీ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేపట్టింది. ఈ విషయంలో చంద్రబాబు తీరును రాజకీయ విశేషకులు సైతం తప్పుబడుతున్నారు.

స్కామ్ జరిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దృష్టికి ఈ విషయం రాకుండా ఉండే అవకాశం ఉండదు. రూ. 988 కోట్లు మందులు, పరికరాలు కొనుగోలు, టెలి మెడిసిన్ కాంట్రాక్టు కేటాయింపుల విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లకుండా కేవలం మంత్రి ఒక్కరే కేటాయింపులు చేశారా అనే సందేహం రాష్ట్ర ప్రజలకు కలుగుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు తన ప్రభుత్వ హాయంలో జరిగిన ఒక అంశం విషయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు ఎం జరిగిగిందనే విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంటుంది.