https://oktelugu.com/

రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు యువకుల మృతి

తెలుగు రాష్ట్రాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు యువకులు మృతి చెందారు. తెలంగాణ లోని బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టగా ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బుగ్గవాగు వద్ద జరిగిన ఈ సంఘటనలో పండితాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్, సాయి అనే యువకులు దుర్మరణం చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 2, 2021 / 10:19 AM IST

    accident

    Follow us on

    తెలుగు రాష్ట్రాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు యువకులు మృతి చెందారు. తెలంగాణ లోని బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టగా ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బుగ్గవాగు వద్ద జరిగిన ఈ సంఘటనలో పండితాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్, సాయి అనే యువకులు దుర్మరణం చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. కడప జిల్లా మైదకూరు నుంచి కాకినాడకు టమాటాల లోడుతో ఓ లారీ వెళ్తోంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం మండలం గోపాలపురం జాతీయరహదారిపై శనివారం ఉదయం ఈ లారీ బైక్ ను ఢీకొట్టింది. దీంతో గాపాలపురం గ్రామానికి చెందిన సతీష్, చంటి, కొత్తపేట మండలం కండిగ గ్రామానికి చెందిన సరేందర్ లు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.