అమరావతి.. బాబుకు మళ్లీ ఎందుకు గుర్తొచ్చింది?

వైసీపీ ప్రభుత్వం దాదాపు మరిచిపోయిన అమరావతిని ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ చేపట్టారు. ఓవైపు పరిపాలన రాజధానిగా విశాఖవైపు అడుగులు వేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఝలక్ ఇస్తూ మళ్లీ అమరావతిపై పోరాటం కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు అమరావతిని మార్చడానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. అమరావతి రైతులు 200 రోజుల నిరసనను పూర్తి చేసిన సందర్భంగా ‘200రోజుల అమరావతి పోరాటం’పేరు […]

Written By: NARESH, Updated On : July 4, 2020 5:54 pm
Follow us on


వైసీపీ ప్రభుత్వం దాదాపు మరిచిపోయిన అమరావతిని ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ చేపట్టారు. ఓవైపు పరిపాలన రాజధానిగా విశాఖవైపు అడుగులు వేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఝలక్ ఇస్తూ మళ్లీ అమరావతిపై పోరాటం కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు అమరావతిని మార్చడానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. అమరావతి రైతులు 200 రోజుల నిరసనను పూర్తి చేసిన సందర్భంగా ‘200రోజుల అమరావతి పోరాటం’పేరు హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు.

జగన్ ని పొగడడం వెనుక పవన్ వ్యూహం భేష్..!

ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అభివృద్ధి ఆగిపోయింది. రూపాయి పుట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఏమీ లేని అమరావతిని వేల కోట్లు పెట్టి నిర్మించడం కన్నా.. అన్నీ ఉన్న విశాఖ నుంచే పాలించడం ఆర్థికంగా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జగన్ సర్కార్ కూడా అదే భావిస్తోంది.అందుకే రాజధాని తరలింపును సమయస్ఫూర్తిగా చేసేందుకు ఆలోచిస్తోంది.

సీఎం జగన్ కు ఎంపీ రఘురామ స్పెషల్ రిక్వెస్ట్..!

అయితే వైసీపీ ప్రభుత్వం సహా అందరూ కరోనా-లాక్ డౌన్ తో మరిచిపోయి 200 రోజులు అవుతున్న ఈ నిరసన కార్యక్రమాన్ని చంద్రబాబు మళ్లీ గుర్తు చేశారు. రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలో పడేయవద్దంటూ నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. వేలాది రైతుల సమస్యను తీర్చాలని.. అమరావతిపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు.అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా చేసే వరకు నిరసనకారులతో పోరాడుతానని చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు.

ఇలా జగన్ సర్కార్ అమరావతి నుంచి విశాఖకు రాజధాని మార్చే పరిణామాలు బ్యాక్ ఎండ్ లో వేగంగా చేస్తున్న నేపథ్యంలో కమ్మ వర్గం అంతా పెట్టుబడి పెట్టిన అమరావతిలో అన్యాయం కాకుండా చంద్రబాబు మళ్లీ పాత పాట పడేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా చంద్రబాబు వర్గం సొంతలాభం కోసం తప్పితే.. రైతులకు లాభం చేకూర్చేది కాదంటూ దెప్పి పొడుస్తున్నారు.