https://oktelugu.com/

ఎన్టీఆర్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న జగన్

రాజకీయాల్లో గట్స్ ఉండాలి. మనపై మనకు నమ్మకం ఉండాలి. ప్రజల్లో అభిమానం ఉండాలి. అవి ఉంటే ఏమైనా చేయవచ్చని ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోవచ్చని నాడు ఎన్టీఆర్ నిరూపించారు. నాదెండ్ల భాస్కర్ రావు మోసం చేసి టీడీపీని హైజాక్ చేస్తే సీఎం అయితే ఎన్టీఆర్ కృంగిపోలేదు. జనంలోనే తేల్చుకున్నారు. ఉప ఎన్నికల్లో అందరూ కొత్త వారు.. ఉద్యోగులు, యువత, సామాజిక సేవాకారులకు టికెట్లు ఇచ్చి అనామకులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. భ్రష్టు పట్టిన రాజకీయ నేతలపై ప్రజల్లోనే తేల్చుకున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 4, 2020 / 06:00 PM IST
    Follow us on


    రాజకీయాల్లో గట్స్ ఉండాలి. మనపై మనకు నమ్మకం ఉండాలి. ప్రజల్లో అభిమానం ఉండాలి. అవి ఉంటే ఏమైనా చేయవచ్చని ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోవచ్చని నాడు ఎన్టీఆర్ నిరూపించారు. నాదెండ్ల భాస్కర్ రావు మోసం చేసి టీడీపీని హైజాక్ చేస్తే సీఎం అయితే ఎన్టీఆర్ కృంగిపోలేదు. జనంలోనే తేల్చుకున్నారు. ఉప ఎన్నికల్లో అందరూ కొత్త వారు.. ఉద్యోగులు, యువత, సామాజిక సేవాకారులకు టికెట్లు ఇచ్చి అనామకులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. భ్రష్టు పట్టిన రాజకీయ నేతలపై ప్రజల్లోనే తేల్చుకున్నారు.

    జగన్ ని పొగడడం వెనుక పవన్ వ్యూహం భేష్..!

    ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే చేయబోతున్నారు. అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసినా పార్టీ కోసం పనిచేసే వారిని యువతను, పోలీసును, లాయర్ ను, ప్రొఫెసర్లను ఎన్నికల్లో దించి నిజాయితీ గల 151 మంది ఎమ్మెల్యేలను, 23మంది ఎంపీలను గెలిపించుకోగలిగారు. అందులో ఇప్పుడు కొందరు తోకజాడిస్తున్నారు అది వేరే సంగతీ..

    నాడు కుల్లు రాజకీయాలను ప్రజల్లోనే తేల్చుకునేవారు ఎన్టీఆర్. నేడు అదే రకమైన ఆవేశాన్ని ప్రస్తుత సీఎం జగన్ లో చూస్తున్నారు తెలుగు జనాలు. జగన్ కూడా పార్టీ మనుషుల కంటే.. కట్టబెట్టిన పదవుల కంటే జనాన్నే ఎక్కువగా నమ్ముకున్నారు. అసెంబ్లీకి కూడా వెళ్లకుండా జనంలోనే ఉన్నారు. వాళ్ల మధ్యనే పంచాయితీ పెట్టుకుంటున్నారు.

    ఇలా చేయాలంటే దమ్ముతోపాటు అపరిమితమైన ప్రజాదరణ ఉండాలి. ఈ రెండూ నాడు ఎన్టీఆర్, నేడు జగన్ లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే జగన్ తోకజాడించే నేతలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ది చెప్పాలని.. వారి పదవులను ఊడబీకించాలని కంకణం కట్టుకున్నారు. చాటు మాటు రాజకీయాలు చేసే టీడీపీ లాంటి పార్టీలకు ప్రజా క్షేత్రంలోనే బుద్ది చెప్పాలని జగన్ రెడీ అయ్యారు.

    సీఎం జగన్ కు ఎంపీ రఘురామ స్పెషల్ రిక్వెస్ట్..!

    తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసి అతడిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు కోరారు. ఆ ముచ్చట త్వరలోనే తీరబోతోంది. ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి. ఇదే రఘురామపై వైసీపీ కొత్త అభ్యర్థిని నిలబెట్టి గెలిపించి రఘురామకు బుద్ది చెప్పాలని యోచిస్తున్నాయి.తద్వారా పార్టీలోని అసమ్మతులందరి నోళ్లు మూయాలని.. జగన్ ఏడాది పాలన ఫెయిల్యూర్ అన్న ప్రతిపక్ష టీడీపీకి కూడా తగిన గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఒకే దెబ్బకు చాలా పిట్లలను రాల్చే జగన్ ఎత్తుగడ ప్రజాక్షేత్రమే కావడం గమనార్హం.

    నిజానికి ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో పక్క పార్టీల్లోని వారిని లాగేయడం.. మంత్రి పదవులు ఇవ్వడం చంద్రబాబు, కేసీఆర్ లు చేశారు. కానీ రాజీనామా చేసి మరీ గెలిపించుకున్న చరిత్ర జగన్ ది.ఇప్పుడు అసమ్మతిని కూడా ప్రజల్లోనే తేల్చుకోవడం.. తనపై రెఫరెండాన్ని తనే పెట్టుకోవడం జగన్ గట్స్ కు నిదర్శనమని.. నాడు ఎన్టీఆర్ కూడా ఇలానే చేసేవారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    -నరేశ్ ఎన్నం