Homeఆంధ్రప్రదేశ్‌చంద్రబాబు అప్పుడలా... ఇప్పుడిలా..!

చంద్రబాబు అప్పుడలా… ఇప్పుడిలా..!

Chandrababu Naidu
రాష్ట్రంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. హై కోర్టు న్యాయమూర్తుల ఫోన్ లు ట్యాప్ అవుతున్నట్లు వెలుగులోకి వచ్చిన వెంటనే మరి కొందరు ప్రముఖులు తమ ఫోన్ లు ట్యాపింగ్ కు గురవుతున్నట్లు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ప్రతి అంశంలోను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాదన వినిపిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్లు కేంద్ర న్యాయ శాఖకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రతిపక్షనేత చంద్రబాబు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు చేయించాలని ప్రధానికి లేఖ రాశారు.

Also Read: జగన్ దగ్గరకు సీక్రెట్ లిస్ట్..! వణికిపోతున్నారు

ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రధానికి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎటువంటి ఆధారాలు లేకుండా తన ఫోన్ ట్యాప్ అవుతుందని బాబు ప్రధానికి లేఖ రాయడంపై ఇటు వైసీపీ నేతులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోను బాబుపై వైఖరిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 40 ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ట్యాపింగ్ కు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

చంద్రబాబు వైఖరి సిఎం కుర్చీలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మరో రకంగా ఉంటుందనేది ఇప్పటికే పలు అంశాల్లో స్పష్టం అయ్యింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోను మరోసారి స్పష్టం అయ్యింది. చంద్రబాబు అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు 2017లో తమ ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారని శాసనసభలోను, బయట వెల్లడించారు. ప్రభుత్వమే ఈ కుట్రకు పాల్పడుతుందని విమర్శించారు. అప్పుడు బాబు ఈ వ్యవహారంపై ఎటువంటి విచారణకు ఆదేశించలేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరపాలని కేంద్రాని లేఖ రాయడం విశేషం.

Also Read: అమరావతి విషయంలో జగన్ కు చుక్కెదురు..! షాకిచ్చిన సుప్రీం

న్యాయమూర్తులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై న్యాయ వ్యవస్థ ఉపేక్షించే అవకాశం లేదు. ఏ వ్యకి ఫోన్ అయినా ట్యాప్ చేయడానికి పోలీసులకు అవకాశం ఉన్నా… కొన్ని అనుమతులు తీసుకుని నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు, ఏజన్సీలు ఫోన్ లు ట్యాప్ చేయడం నేరమనే విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై రాజకీయంగా లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారనే వాదనలు వినిపిస్తున్నాయి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version