మెగా కుటుంబం నుండి టాలీవుడ్ లోకి పరిచయమవతున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ సినిమా విడుదలకి కరోనా వైరస్ బ్రేకులేసింది. ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో దర్శక నిర్మాతలు థియేటర్లు పూర్తిగా ఓపెన్ అయ్యాకనే విడుదల చెయ్యాలని ఇంతకాలం నిరీక్షించారు. ఈ నేపథ్యలోనే 12 వ తేదీన రానున్న ఉప్పెన చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ కు ఏకంగా వైష్ణవ్ తేజ్ మేనమామ మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చి చిత్ర యూనిట్ ని అభినందించారు.
Also Read: సలార్ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ !
చిరంజీవి మాట్లాడుతూ… ‘ఉప్పెన’ ఒక అద్భుత దృశ్యకావ్యమని, సినిమా చూశాక మరొక రంగస్థలం అనిపించిందన్నారు. బుచ్చిబాబు చూపించిన పనితనం, దర్శకత్వ విలువలు గొప్పగా ఉన్నాయని, భారతీరాజా గుర్తుకొచ్చారని ప్రశంసించారు. విజయ్ సేతుపతి నటించడంతోనే ఈ సినిమా సక్సెస్ అయిపోయిందని, భారతదేశంలోనే ఆయనొక గొప్ప నటుడని కొనియాడారు. వైష్ణవ్ కళ్ళతోనే మాయ చేయగలడు. ఈ చిత్రంలో అతని నటనతో మా కుటుంబానికి గర్వకారణం అవుతాడని అన్నారు. తొలి సినిమా అయినా కృతిశెట్టి చాలా బాగా చేసిందని పొగిడారు.
Also Read: అల్లు అర్జున్ కారవాన్ ను ఢీకొట్టిన లారీ
ఈ మధ్యన చిరంజీవి ఇలాంటి ఈవెంట్లలో మాట్లాడుతూ ఆ సినిమా, తన సినిమాల గురించి సీక్రెట్స్ బయటపెట్టేస్తున్నారు. ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నోరు జారి మెగా అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పేశారు. ఉప్పెన చిత్ర నిర్మాతల గురించి మాట్లాడుతూ వారి నిర్మాణ సంస్థలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నట్లుగా చెప్పారు. దీంతో చిరంజీవి ఖాతాలో ఆచార్య, లూసిఫెర్ తెలుగు రీమేక్, వేదాళం తెలుగు రీమేక్, మెహర్ రమేష్ మూవీలతో పాటుగా బాబీ మూవీ కూడా చేరింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్