Rangasthalam Hindi Dubbed: బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రస్తుతం దక్షిణాది సినిమాల పిచ్చి పట్టుకుంది. వాళ్ళు తెలుగు సినిమాలంటే చాలా బాగా ఇష్టపడుతున్నారు. అందుకే, ఏవరేజ్ గా ఉన్న పుష్ప సినిమా బాలీవుడ్లో సంచలనం సృష్టించింది. కాగా ఈ నేపథ్యంలో మరిన్ని దక్షిణాది సినిమాలు త్వరలో హిందీ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయని టాక్ నడుస్తోంది. ఇప్పటికే అల వైకుంఠపురములో.. హిందీ డబ్బింగ్ వెర్షన్ను జనవరి 26న రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్ ను బట్టి రంగస్థలం, అదిరింది, విశ్వాసం లాంటి చిత్రాలు వరుసగా థియేటర్లలోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, బాలీవుడ్ లో స్టార్ హీరోలు కొందరు రంగస్థలం సినిమా పై ఆసక్తి చూపించారు. ముఖ్యంగా షాహిద్ కపూర్ ఆ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని ప్లాన్ చేశాడు. మరి భవిష్యత్తులో రంగస్థలం షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే, ఒకవేళ రంగస్థలం హిందీలోకి వెళ్తే.. అక్కడ కూడా సుకుమారే డైరెక్ట్ చేస్తాడా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.
ఒకపక్క సుకుమార్ కి ఎప్పటి నుంచో హిందీలో సినిమా చేయాలని ఆశ. ఎంతైనా క్రియేటివిటీ విషయంలో సుక్కు పెద్ద ‘క్రియేటివ్ డైరెక్టర్. అసలు ఆర్య సినిమాతోనే సుక్కు హిందీలోకి ఎంట్రీ ఇవ్వాలి. అయితే, అప్పుడు కొన్ని కారణాల కారణంగా అది కుదరలేదు. ఆ తర్వాత ‘100% లవ్’ సినిమాతో ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు. కానీ ఆ తర్వాత ‘నేనొక్కడినే’ సినిమాతో సుకుమార్ కి హిందీలో మంచి గుర్తింపు వచ్చింది.
Also Read: ‘మాటరాని మాయవా .. మాయజేయు మాటవా’.. విశ్వక్ సేన్ ఆరాటం !
మహేష్ బాబును పాన్ ఇండియా రేంజ్ లో చూపించాడు అనే క్రెడిట్ సుక్కుకి దక్కింది. అయితే, ‘నేనొక్కడినే’ సినిమా కమర్షియల్ గా చాలా దారుణంగా ప్లాప్ అయింది. అందుకే, హిందీలో ఆ సినిమాను రీమేక్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా హిందీలో డబ్ అయి చాలా గొప్పగా ఆడింది. జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ రేంజ్ ను కూడా రెండింతలు పెంచింది.
అయితే, అంతలో ‘రంగస్థలం’తో చరణ్ కెరీర్ కే మైల్ స్టోన్ లాంటి సినిమా ఇచ్చాడు సుక్కు. అందుకే, చిట్టచివరకు సుకుమార్ హిందీ ఫస్ట్ సినిమా ‘రంగస్థలం’ కాబోతుంది.
Also Read: ‘అఖండ’ అమ్మ సాంగ్ అదరగొడుతుంది !