https://oktelugu.com/

సీఐడీ నోటీసులపై హైకోర్టుకు బాబు

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పటికే సీఐడీ నోటీసుల అందించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన సీఐడీ.. 25న చంద్రబాబుతో పాటు మరికొందరిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లో నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు. చంద్రబాబు కూడా ఈ నోటీసులపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టులో […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 18, 2021 / 12:50 PM IST
    Follow us on


    అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పటికే సీఐడీ నోటీసుల అందించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన సీఐడీ.. 25న చంద్రబాబుతో పాటు మరికొందరిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లో నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు. చంద్రబాబు కూడా ఈ నోటీసులపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

    Also Read: విజయసాయిని దెబ్బకొడితేనే ఆశలు..!

    మంగళవారం నోటీసులు అందుకున్న తర్వాత చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. పార్టీ సీనియర్‌ నేతలు పయ్యావుల కేశవ్‌, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో కలిసినప్పుడు.. సీఐడీ నోటీసుల అంశం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ప్రభుత్వం కక్షపూరితంగా వెళ్తోందని.. మొదట పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని.. ఇప్పుడు తన వరకూ వచ్చారన్నారు చంద్రబాబు. ధైర్యంగా ఎదుర్కొందామని., ఏ తప్పూ చేయనప్పుడు ఇలాంటి వాటికి భయపడాల్సిన పనిలేదని నేతలతో చెప్పారట.

    అమరావతి భూ కుంభకోణం కేసులో పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరును చేర్చారు. రాజధాని భూముల కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా చంద్రబాబు వ్యవహరించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు సహా మాజీ మంత్రి నారాయణ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఐపీసీ సెక్షన్ 120బీ, 166,167, 217 సహా అసైన్డ్ భూముల అమ్మకం నిరోధక చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా సీఐడీ కేసు నమోదు చేసింది.

    Also Read: కమ్మని సాంబారులా పళని పాలన

    ఆ నోటీసులను సవాల్‌ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశముంది. మరోవైపు చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఈ కేసులో మరింత సమాచారం ఇచ్చేందుకు ఇవాళ సీఐడీ కార్యాలయానికి వెళ్లారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్