Young Team: టీడీపీలో యంగ్ టీంకే మొగ్గుచూపుతున్న బాబు?

Young team: 2023 ఎన్నికలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీఎంగా ఒక్కసారి అవకాశమిస్తేనే టీడీపీని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇక మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ అడ్రస్ గల్లంతేనని చంద్రబాబు భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీలో కొత్తరక్తాన్ని ఎక్కించేందుకు సిద్ధపడుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలువడానికి ఆపార్టీకి ఉన్న యంగ్ టీమే కారణమని […]

Written By: NARESH, Updated On : December 9, 2021 12:39 pm
Follow us on

Young team: 2023 ఎన్నికలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీఎంగా ఒక్కసారి అవకాశమిస్తేనే టీడీపీని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇక మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ అడ్రస్ గల్లంతేనని చంద్రబాబు భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నారు.

Chandrababu Naidu

ఇందులో భాగంగానే టీడీపీలో కొత్తరక్తాన్ని ఎక్కించేందుకు సిద్ధపడుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలువడానికి ఆపార్టీకి ఉన్న యంగ్ టీమే కారణమని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికితోడు టీడీపీలోని సీనియర్లపై ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వ్యతిరేకత కిందటి ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారితీసినట్లు అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో పార్టీలో మార్పులు చేర్పులకు ఆయన రంగం సిద్ధం చేస్తున్నారు.

పనిలో పనిగా పార్టీలోని వైసీపీ కోవర్టులను ఏరిపాసేందుకు ఈ నిర్ణయాన్ని ఉపయోగించుకోనున్నారని తెలుస్తోంది. అలాగే పార్టీలో ఉంటూ టీడీపీ విజయావకాశాల మీద దెబ్బకొడుతున్న సీనియర్లను పక్కన పెట్టనున్నారని డిసైడ్ అయ్యారట.  వీరి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.

గత ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైనప్పటి నుంచి చంద్రబాబు ఇదే మాట చెబుతుండటంతో సీనియర్లు లైట్ తీసుకుంటున్నారు. అయితే కుప్పంలో టీడీపీ ఓటమి తర్వాత పార్టీలో ప్రక్షాళన తప్పదని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఆరునెలలు డైడ్ లైన్ పెట్టుకొని పార్టీలోని కోవర్టులు, పార్టీని నష్టపరుస్తున్న సీనియర్లను ఏరిపారేయనున్నారని టాక్ విన్పిస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీకి చెందిన సీనియర్లు చాలామంది సైలంటయ్యారు. నియోజకవర్గాల్లోని సమస్యలను గాలికొదిలేస్తున్నారు. దీంతో పార్టీని బలోపేతం చేసేలా నియోజవకర్గ ఇన్ ఛార్జిలను కొత్తగా నియమించేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. దాదాపు 80కి పైగా నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలు కరువయ్యారని ఈనేపథ్యంలోనే కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు.

Also Read: ఓటీఎస్ రాజకీయం.. టీడీపీ, వైసీపీలో ఎవరు నెగ్గేనో?

దీంతో సీనియర్లు తమ వారసులను రంగంలోకి దింపుతున్నారు. నియోజకవర్గ బాధ్యతలు తమ వారసులకు అప్పగించేలా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదేగనుక జరిగితే అది పార్టీకి ఇది పెద్ద మైనస్ గా మారే అవకాశం ఉందని టాక్ విన్పిస్తుంది. తండ్రులపై ఉన్న వ్యతిరేకత వాళ్ల వారసులపై ఉండదా? అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.

గత ఎన్నికల్లో సీనియర్ల వారసులే కాదా నియోజకవర్గాల్లో ప్రచారం చేసిందంటూ పలువురు ఉదాహరిస్తున్నారు. దీంతో చంద్రబాబు సీనియర్ల వారసులకు పెద్దపీఠ వేస్తారా? లేదంటే కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా? అనేది ఆసక్తిని రేపుతోంది.

Also Read: సరైన నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు ఫెయిల్..?