https://oktelugu.com/

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్.. కుంభస్థలం బద్దలు కొట్టడం గ్యారంటీ

RRR Movie: రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూసేందుకు మెగా, నందమూరి అభిమానులు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. అలానే ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు నటిస్తుండడంతో ఆర్ఆర్ఆర్ పై హైప్ ఎక్కువగానే ఉంది. కాగా ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్… అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ నెట్టింట్లో సంచలనం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 9, 2021 / 11:27 AM IST
    Follow us on

    RRR Movie: రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూసేందుకు మెగా, నందమూరి అభిమానులు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. అలానే ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు నటిస్తుండడంతో ఆర్ఆర్ఆర్ పై హైప్ ఎక్కువగానే ఉంది. కాగా ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్… అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ నెట్టింట్లో సంచలనం సృష్టించాయి. ఇప్పుడీ సినిమా నుంచి ట్రైలర్ కూడా వచ్చేసింది. ముందుగా థియేటర్లలో వచ్చిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.

    RRR Movie

    Also Read: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో ఇవే హైలైట్స్.. ఇవి 5 గమనించారా?

    అభిమానుల అంచనాలు ఏ మాత్రం తగ్గించకుండా ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ను కట్ చేశారు చిత్రయూనిట్. అరాచకం అనే పదం చిన్నదే అవుతుంది అని అభిప్రాయ పడుతున్నారు అభిమానులు. ఈ ట్రైలర్‌ నిడివి మూడు నిమిషాల 7సెకన్లు ఉండగా.. ట్రైలర్‌ కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పై తెరకెక్కిన యాక్షన్ సన్నివేశాలు విజువల్ ట్రీట్ లా  అనిపిస్తున్నాయి. ముఖ్యంగా పులితో ఎన్టీఆర్ ఫైట్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. అలానే ఎన్టీఆర్ తారక్ మధ్య బాండింగ్ ని బాగా చూపించారు. సాధారణ  ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులను గర్వపడేలా ఈ సినిమా చేస్తుందనడంలో సందేహం లేదు. అల్లూరి గెటప్ లో చరణ్ గూస్ బంప్స్ తెప్పించాడు.  ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. వచె ఏడాది జనవరి 7 న సినిమా విడుదల కానుంది.

    Also Read: ‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలొచ్చాయ్..’ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బీభత్సం