Chandrababu : అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన యాక్టివ్ గా ఉంటారు.. ప్రభుత్వాన్ని నడిపించడంలోనూ.. ప్రతిపక్షంగా ఆందోళన చేయడంలోనూ ఆయనది సెపరేట్ రూట్.. అలా నిత్యయవ్వనుడిగా కనిపించే చంద్రబాబుకు బలం.. బలహీనత కార్యకర్తలే. చంద్రబాబు ఏస్థాయిలో ఉన్నా కార్యకర్తలు ఆయన వెంట ఉంటారు. అధికారంతో సంబంధం లేకుండా బాబు కోసం ఏమైనా చేయడానికి ముందుంటారు. అయితే అంతలా తమ అధినేత కోసం తపించే కార్యకర్తలను బాబు పట్టించుకోవడం లేదా..? వారి బాగోగులు చూడడం లేదా..? అని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.

40 ఏళ్ల రాజకీయ జీవింతంలో చంద్రబాబు ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొన్నారు. సక్సెస్ కూడా సాధించారు. రాజకీయ జీవితంలో బాబు సక్సెస్ అయినా.. ఫెయిల్ అయినా అందుకు కారణం టీడీపీ కార్యకర్తలే అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ఏమైనా చేయగలే కరుడు కట్టిన కార్యకర్తలున్నారు. మిగతా పార్టీలతో పోలిస్తే టీడీపీలో కింది క్యాడర్ ఎక్కువగా.. బలంగా ఉంది. పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా వారి వారు చేస్తారు. పార్టీ అధినేతను నమ్ముకొని ముందుకు సాగుతారు.
అయితే అధికారంలో ఉన్నప్పుడు బాబుకు కార్యకర్తలు కనిపించరు. ఎంతసేపు బడా నాయకుల గురించే ఆలోచించే బాబు కింది కేడర్ ను పట్టించుకోలేదు. దీంతో గత ఎన్నికల్లో బాబు ఓడిపోవడానికి కార్యకర్తలేకారణమని కొందరు అంటారు. పార్టీ కోసం పరితపించి వారికి అధికారంలో ఉన్నప్పుడు కనీస న్యాయం జరగలేదు. చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా వారికి దక్కకుండా చేశారు. దీంతో కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక విపక్షంలో ఉన్నప్పడు ఎలా న్యాయం చేస్తారు..? అయితే కొందరు మాత్రం పార్టీ కోసం లక్షల రూపాయలైనా ఖర్చేచేయడానికి వెనుకాడరు.
2019 ఎన్నికల్లో కొందరు పార్టీ కార్యకర్తలు తమ సొంత డబ్బులను ఖర్చు పెట్టీ మరీ పార్టీ కోసం ప్రచారం చేశారు. కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో వారు తీవ్రంగా నష్టపోయారు. వారి గురించి పట్టించుకునే వారు లేదు. అయితే ఇటీవల చంద్రబాబు ఇటీవల రియలైజ్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ బలంగా ఉండడానికి కార్యకర్తలే కారణమని, వారిని నెత్తిన పెట్టుకుంటానని ప్రసంగించారు. ఇన్నేళ్లకైనా కార్యకర్తల గురించి ఆలోచించిన బాబు ఇక ముందు కూడా వారి గురించి ఆలోచిస్తే పార్టీకి న్యాయం చేస్తారని అంటున్నారు.