https://oktelugu.com/

Tollywood Anchors: తెలుగు టాప్ యాంకర్లు ఏం చదువుకున్నారో తెలిస్తే అవాక్కే!

Tollywood Anchors: బుల్లితెర అయినా.. సినిమా పండుగ అయినా ఈ తెలుగు టాప్ యాంకర్లు ఉండాల్సిందే.. వారి మాట తూటాలా పేలుతుంటాయి. కామెడీ పంచుతుంటాయి. సందర్భానుసారం వారు వేసే పంచులు అలరిస్తుంటాయి. అందుకే ఇప్పుడు తెలుగులో టాప్ యాంకర్లకు తెగ డిమాండ్ వచ్చి పడింది. యాంకర్లు సుమ, ప్రదీప్, ఝాన్సీ, ఉదయభాను, అనసూయ, రష్మీ, శ్రీముఖి ఇలా ఒక్కటేమిటీ చాలా మంది అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై అలరిస్తున్నారు. టాలీవుడ్ యాంకర్లలో చాలా మందికి సినిమా తారలను […]

Written By:
  • NARESH
  • , Updated On : October 26, 2021 / 09:28 AM IST
    Follow us on

    Tollywood Anchors: బుల్లితెర అయినా.. సినిమా పండుగ అయినా ఈ తెలుగు టాప్ యాంకర్లు ఉండాల్సిందే.. వారి మాట తూటాలా పేలుతుంటాయి. కామెడీ పంచుతుంటాయి. సందర్భానుసారం వారు వేసే పంచులు అలరిస్తుంటాయి. అందుకే ఇప్పుడు తెలుగులో టాప్ యాంకర్లకు తెగ డిమాండ్ వచ్చి పడింది. యాంకర్లు సుమ, ప్రదీప్, ఝాన్సీ, ఉదయభాను, అనసూయ, రష్మీ, శ్రీముఖి ఇలా ఒక్కటేమిటీ చాలా మంది అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై అలరిస్తున్నారు.

    Top-Telugu-TV-Anchors

    టాలీవుడ్ యాంకర్లలో చాలా మందికి సినిమా తారలను మించి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో సైతం వారిపట్ల విపరీతమైన క్రేజ్ ఉంది. పలు టీవీ షోలతో పాపులర్ అయిన యాంకర్లలో ప్రస్తుతానికి టాప్ లో ఉన్నారు సుమ, ప్రదీప్, అనసూయ, రేష్మీలు ముఖ్యులుగా ఉన్నారు. ఇంతకీ అసలు వీరు ఇంత బాగా బుల్లితెరపై రాణిస్తున్నారంటే ఎంత చదివి ఉంటారు? పెద్ద పెద్ద చదువులు చదివారా? ఏం చదివారాన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. వారి క్వాలిఫికేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

    -సుమ
    కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సుమ. ఆ తర్వాత వెండితెర నుంచి బుల్లితెరకు మారింది. పలు సీరియల్స్ లోనూ నటించింది. ఆ తర్వాత రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకొని పలు షోలకు యాంకర్ గా మారింది. ఇక వెనుదిరిగి చూసుకోకుండా దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో నంబర్ 1 యాంకర్ గా సుమ ఉంది. ఇంతకీ సుమ చదివింది ఎంతో తెలుసా ‘ఎం.కామ్’.

    -ఝాన్సీ
    తెలుగులో సుమ తర్వాత మరో టాప్ యాంకర్ ఝాన్సీ. ఈమె కూడా తొలుత సినిమా నటిగానే పేరు పొందింది. ఆ తర్వాత బుల్లితెరపైకి మారి టాప్ యాంకర్ గా నిలిచింది. ఝాన్సీ చదివింది ‘బీటెక్’.

    -ఉదయభాను
    తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి టాప్ యాంకర్ గా మారింది ఉదయభాను. ఈమె కూడా పలు సినిమాల్లో నటించింది. కొన్ని ఐటెం సాంగ్ లలో నర్తించింది. యాంకర్ గా ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు టాప్ నిలిచింది. ఉదయభాను చదివింది ‘ఎంఏ’.

    -ప్రదీప్
    తెలుగు మేల్ యాంకర్లలో నంబర్ 1 ప్రదీప్ మాచిరాజు. అతడి కామెడీకి ఫ్యాన్స్ కానీ వారు ఉండరు. సందర్భానుసారం ప్రదీప్ వేసే పంచులు అలరిస్తాయి. సినిమాలు, బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్నాడు. విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ‘బీటెక్’ పూర్తి చేశాడు.

    -అనసూయ
    బుల్లితెరపై హాట్ యాంకర్ ఎవరయ్యా అంటే ఠక్కున అనసూయ పేరు చెబుతారు. ఆమె అందం, అభినయం అంతలా ఆకట్టుకుంటాయి. మొదట సాక్షిలో న్యూస్ యాంకర్ గా మొదలైన అనసూయ ప్రస్తానం.. అనంతరం ఎంటర్ టైన్ మెంట్ చానెల్స్ లో యాంకర్ గా.. ఇప్పుడు హీరోయిన్, నటిగా సాగే వరకూ ఎదిగింది.అనసూయ చదివింది ‘ఎంబీఏ’.

    -రష్మీ
    రష్మీ ముందుగా జూనియర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించింది. అనంతరం బుల్లితెరపై యాంకర్ గా పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది. అనంతరం పలు సినిమాల్లో హీరోయిన్ గానూ చేసింది. ఇప్పుడు పాపులర్ యాంకర్ గా కొనసాగుతోంది. రేష్మీ ‘డిగ్రీ’ పూర్తి చేసింది.