నాటు సారా జోరు!

లాక్ డౌన్ కారణంగా మద్యం విక్రయాలు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను మందు బాబులు ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలులో ఉన్న సమయంలో పలుచోట్ల నాటు సారా తయారు చేసే వారు. ఇప్పుడు మరోమారు నాటు సారా తయారీపై అక్రమార్కులు దృష్టి సారించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో నాటు సారా తయారీ ఇప్పటికే ప్రారంభమయ్యింది. మద్యం బ్లాక్ మార్కెట్ లో ఒక్కో ఫుల్ బాటిల్ రూ.5 వేలు వరకూ వసూలు చేస్తున్నారు. దీంతో చాలా తక్కువ ధరకు […]

Written By: Neelambaram, Updated On : April 23, 2020 4:16 pm
Follow us on


లాక్ డౌన్ కారణంగా మద్యం విక్రయాలు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను మందు బాబులు ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలులో ఉన్న సమయంలో పలుచోట్ల నాటు సారా తయారు చేసే వారు. ఇప్పుడు మరోమారు నాటు సారా తయారీపై అక్రమార్కులు దృష్టి సారించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో నాటు సారా తయారీ ఇప్పటికే ప్రారంభమయ్యింది.

మద్యం బ్లాక్ మార్కెట్ లో ఒక్కో ఫుల్ బాటిల్ రూ.5 వేలు వరకూ వసూలు చేస్తున్నారు. దీంతో చాలా తక్కువ ధరకు లభించే నాటు సారా విక్రయాలు జోరందుకున్నాయి. మారుమూల ప్రాంతాలు, అడవులు వంటి ప్రదేశాలలో నాటుసారా ఎక్కువగా కాస్తున్నారు.

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండల పరిధిలోని చినగొల్లపాలెం దీవిలో నాటుసారాపై సమాచారం రావటంతో సముద్ర తీరం వెంబడి సరుకు తోటల్లో విస్తృతంగా దాడులు జరపగా, ఇసుక నేలల్లో దాచి ఉంచిన 4 టిన్నులు, 15 లీటర్ల నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో నల్లమల ఆటవీ ప్రాంతంలో సారా కాస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. సున్నిపెంట మండలం ఎలుగుబంటి సెల, ఎదురుమట్టి సెల, లింగలగట్టు డంప్ యార్డ్ లలో 5,200 లీటర్ల బెల్లం ఊట, 50 లీటర్ల నాటు సారాను అధికారులు స్వాధీనం చేసుకున్నాట్లు ఏస్.ఐ పీరయ్య యాదవ్ తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి లో గ్రామ వలంటేరు వాసు స్వయంగా నాటు సారా ఇంట్లో కాచి డోర్ డెలివరీ చేసున్నట్లు అలిపిరి పోలీసులు గుర్తించి అతనిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.