Chandrababu-Pawan Kalyan: ఏపీలో రాజకీయం రోజురోజుకూ బాగా వేడెక్కుతోంది. అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రాజకీయ క్షేత్రంలో దిగుతున్నాయి. వైసీపీని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పోరుకు సిద్ధమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీయాలని డిసైడ్ అయ్యారు. ఒక రోజు దీక్ష చేసి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీలోని రాజకీయ పార్టీలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. నష్టాల ప్రాతిపదికన ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తామని కేంద్రం చెప్తోంది. కాగా, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది ఏపీ సర్కారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంది. అయితే, ఈ విషయమై పార్లమెంట్‌లో మాత్రం నిరసన తెలిపినట్లు కనబడటం లేదు. ఇకపోతే ఈ విషయంలో కేంద్రంను టార్గెట్ చేయకుండా ఏపీలో అధికారంలో ఉన్న రాష్ట్రప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనేదే ప్రతిపక్షాల వ్యూహంగా ఉంది. ఇందులో భాగంగానే గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలిపింది.
తాజాగా పవన్ కల్యాణ్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనబడుతోంది. కేంద్రంపై ఒత్తిడి తేకుండా రాష్ట్రప్రభుత్వానిదే తప్పిదమని పవన్ అంటున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలో సింగిల్ డే దీక్ష చేస్తానని చెప్తున్నారు. నిజానికి ఈ సింగిల్ డే నిరసన దీక్షలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశారు. కాగా, ఇప్పుడు చంద్రబాబు చూపిన ఆ బాటలో పవన్ కల్యాణ్ వెళ్తున్నారు.
Also Read: ఏపీ సినిమా టికెట్ల విషయంలో ప్రొడ్యూసర్స్ తారక్ సాయం తీసుకోనున్నారా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై రాష్ట్రసర్కారును టార్గెట్ చేస్తూ ఈ మేరకు నిరసన చేయబోతున్నారు జనసేనాని. దీక్ష ద్వారా జగన్ సర్కారుపై ఒత్తిడి పెంచనున్నారు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని పవన్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ దీక్షతో వైసీపీ మరోసారి స్టీల్ ప్లాంట్ విషయమై స్పందించాల్సి ఉంటుంది. పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు ఏం చేస్తున్నారనే ప్రశ్నలకూ సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
మొత్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ద్వారా రాజకీయం చేయాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయినట్లు పరిస్థితులు అయితే కనబడుతున్నాయి.
Also Read: ‘జగనాలూ’.. కాచుకో ఇక.. ‘ప్రత్యేక హోదా’ రగిలిస్తున్న చంద్రబాబు!