AP Movie Tickets: ప్రపంచ సినీ అభిమానులు వెయిట్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కాబోతున్నది. ఈ క్రమంలోనే ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమా ట్రైలర్ చూసి ఇప్పటికే చిత్రం విజయం సాధించేసిందని ప్రేక్షకులు అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ సభ్యుల చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను ఇప్పటికే బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ఏపీ సినిమా టికెట్ల రేట్ల విషయం ప్రస్తావనకు వచ్చింది. టికెట్ల ధర తగ్గించిన విషయమై ఏపీ సర్కారుతో మాట్లాడేందుకు జూనియర్ ఎన్టీఆర్ సాయం తీసుకుబోతారా అని మీడియా వారు వేసిన ప్రశ్నకు ప్రొడ్యసర్ దానయ్య ఏమని సమాధానమిచ్చారంటే..

ఏపీలో సినిమా టికెట్ల రేట్లు బాగా తగ్గించేశారని, దాని ప్రభావం పెద్ద సినిమాలపై పడుతుందని, ఈ క్రమంలోనే హీరో ఎన్టీఆర్ సాయంతో ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించారు. దానికి ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య స్పందించారు. ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని, పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు తగ్గిస్తే కుదరదని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని పేర్కొన్నారు. అయితే, విలేకరి ప్రస్తావనలో జూనియర్ ఎన్టీఆర్ ఆప్త మిత్రులు ఏపీ ప్రభుత్వంలో ఉన్నారనే మాటలు ప్రజెంట్ చర్చనీయాంశమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆప్త మిత్రునిగా భావించబడే ఆ వ్యక్తి మంత్రి కొడాలి నాని అని పలువురు అంటున్నారు.

Also Read: సీఐడీ అధికారులను అడ్డుకున్న ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే..?
కొడాలి నాని గతంలో టీడీపీలో ఉన్నపుడు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆప్తుడు. జూనియర్ ఎన్టీఆర్ చదువుకునే సమయంలో కొడాలి నానిని కలిశేవాడు. ఆయన్ను అన్న అని పిలిచేవాడినని ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అయితే, మారిన రాజకీయ పరిణామాల్లో కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీలో చేరాడు. అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యాడు. అయితే, కొడాలి నాని సైతం తాను సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలకు రుణపడి ఉంటానని గతంలో వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో అడుగులు వేయించిన వ్యక్తి హరికృష్ణని కొడాలి నాని గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ సాయంతో నిర్మాతలు టికెట్ల రేట్ల విషయం ఏపీ ప్రభుత్వంలోని మంత్రులతో ప్రస్తావించబోతున్నారా అన్న చర్చ మొదలైంది.
టికెట్ల రేట్ల విషయంలో ప్రొడ్యూసర్స్ మరోసారి ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేయబోతున్నారని ప్రొడ్యూసర్ దానయ్య మాటలను బట్టి అర్థమవుతోంది. చూడాలి మరి.. ఏమవుతుందో.. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందో లేదో..
Also Read: సాయితేజ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం ఎంత సాయం చేసిందో తెలుసా?