https://oktelugu.com/

Chandrababu Pawan: చంద్రబాబు, పవన్ మళ్లీ కలవబోతున్నారోచ్!

Chandrababu Pawan: అమరావతి రైతుల ఆందోళన యాత్ర ముగింపు దశకు వచ్చేసింది. ఈనెల 17వ తేదీన తిరుపతిలో బహిరంగ సభ జరుగబోతోంది. మొదట తిరుపతి సభకు వైసీపీ ప్రభుత్వం అనుమతివ్వలేదు. అనంతరం రైతులు కోర్టుకెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్నారు. ఇక ఈ అమరావతి యాత్రను వెనుకుండి నడిపిస్తున్న చంద్రబాబును దీనికి ఆహ్వానించారు. అమరావతి రైతుల బహిరంగ సభ ముగింపుకు చంద్రబాబు రానుండడం ఖాయమైంది. ఆయన పర్యటన కొద్దిసేపటి క్రితమే ఖరారు చేశారు. ఉదయం 10 గంటలకే తిరుపతి […]

Written By: , Updated On : December 15, 2021 / 09:57 PM IST
Follow us on

Chandrababu Pawan: అమరావతి రైతుల ఆందోళన యాత్ర ముగింపు దశకు వచ్చేసింది. ఈనెల 17వ తేదీన తిరుపతిలో బహిరంగ సభ జరుగబోతోంది. మొదట తిరుపతి సభకు వైసీపీ ప్రభుత్వం అనుమతివ్వలేదు. అనంతరం రైతులు కోర్టుకెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్నారు. ఇక ఈ అమరావతి యాత్రను వెనుకుండి నడిపిస్తున్న చంద్రబాబును దీనికి ఆహ్వానించారు.

Chandrababu Pawan

Chandrababu Pawan

అమరావతి రైతుల బహిరంగ సభ ముగింపుకు చంద్రబాబు రానుండడం ఖాయమైంది. ఆయన పర్యటన కొద్దిసేపటి క్రితమే ఖరారు చేశారు. ఉదయం 10 గంటలకే తిరుపతి చేరుకునే చంద్రబాబు రైతుల సభలో పాల్గొననున్నారు.

Also Read: ఆ మాజీ న్యాయమూర్తులు జగన్ కు అందుకే సపోర్టు చేశారట.. ఇదేం న్యాయం చంద్రబాబూ?

ఇక ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ ను కూడా రప్పించేందుకు అమరావతి రైతు సంఘాల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారట.. ఇప్పటికే అమరావతి రైతుల యాత్రకు జనసేనాని పవన్ మద్దతు తెలిపారు. అప్పట్లో వారితో కలిసి ఉద్యమించారు కూడా.. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సభకు వస్తారా? రారా? అన్నది డౌటు ఉండేది. కానీ అమిత్ షా వచ్చాక అమరావతికి మద్దతు తెలుపడంతో బీజేపీ సైతం ఈ ఆందోళనలో స్వయంగా పాల్గొంది.

ఈ క్రమంలోనే పవన్ రావడం పక్కా అని.. ఆయన వస్తే ఈ ఉద్యమానికి ఊపు వస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ వస్తే మాత్రం ఒకేవేదికపై చంద్రబాబు, పవన్ లు కలిసి పాల్గొననున్నారు. వారి పొత్తు పొడుపులకు ఇదే సభ వేదిక అయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చ సాగుతోంది.

Also Read: జస్టిస్ చంద్రు కామెంట్స్ మీద చంద్ర‌బాబు క్లారిటీ.. అందుకే అలా అన్నార‌ట‌..!