Bheemla Nayak: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా హీరోలుగా మల్టీస్టార్‌గా తెరకెక్కుతోన్న సినిమా భీమ్లానాయక్. ఇందులో వీరిద్దరు పోటాపోటీగా కనిపించనున్నారు. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. కాగా, తెలుగులో సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండటం విశేషం. సితార ఎంటర్ప్రైజెస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు.
Bheemla Nayak
The power storm is unstoppable. #BheemlaNayakTitleSong joins in 100 million club on @youtube🤘
🎹@MusicThaman#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @MenenNithya @saagar_chandrak @ramjowrites @dop007 @NavinNooli @vamsi84 @SitharaEnts pic.twitter.com/nYxEp1qEOI
— Aditya Music (@adityamusic) December 15, 2021
ఇద్దరు పెద్ద హీరోలతో కలిసి ఇటీవలే కాలంలో సినిమాలు తెరకెక్కించడం సర్వ సాధారణమైపోయింది. ఈ క్రమంలోనే సినిమాపై అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే భీమ్లానాయక్ నుంచి విడుదలైన పాటలు, టీజర్లు రానా, పవన్ అభిమానులకు సినిమాపై ఎక్సైట్ పెంచేశాయి. వచ్చిన అప్డేట్లన్నీ సోషల్‌మీడియాలో రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా, భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఎన్నడూ లేని విధంగా ఈ సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Also Read: ఏపీ టికెట్ ధరల విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం
భీమ్లానాయక్ ఎలివేషన్‌కు తగ్గట్లు ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. థమన్ సంగీతం అందించారు. వచ్చే ఏడాది జనవరి12న ఈ సినిమా విడుదల కానుంది. కాగా, మరోవైపు రానా నటించిన 1945 సినిమా కూడా ఈ డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. దీంతో పాటు, సంక్రాంతి బరిలో భారీ ప్రాజెక్టులైన ఆర్ఆర్ఆర్ , రాధేశ్యామ్ కూడా బరిలోకి దిగుతున్నాయి. వీటి నడుమ భీమ్లానాయకు ఎలా తట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: రాధేశ్యామ్ నుంచి సంచారి ఫుల్సాంగ్ విడుదల.. సూపర్ అంటున్న నెటిజన్లు