https://oktelugu.com/

తనకు తానే డబ్బా కొట్టుకుంటున్న బోల్డ్ బ్యూటీ !

కంగనా రనౌత్ ఏం చేసినా వైవిధ్యంగానే ఉంటుంది. ముఖ్యంగా తనకు తానూ సొంత డబ్బా కొట్టుకోవడంలో ఆమెకు రారు ఎవరూ సాటి. అసలు కంగనా అంటేనే బోల్డ్ కామెంట్స్ కి కేరాఫ్ అడ్రెస్. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ తన గురించి ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చింది. అసలు తనంత గొప్ప నటి ఈ భూమి మీద ఎవరూ లేరని తనకి తానే చాటి చెప్పుకుంది. ట్వీట్ చేస్తూ.. ఒక వైపు ‘తలైవి’ సినిమాలో జయలలితగా […]

Written By:
  • admin
  • , Updated On : February 10, 2021 / 09:51 AM IST
    Follow us on


    కంగనా రనౌత్ ఏం చేసినా వైవిధ్యంగానే ఉంటుంది. ముఖ్యంగా తనకు తానూ సొంత డబ్బా కొట్టుకోవడంలో ఆమెకు రారు ఎవరూ సాటి. అసలు కంగనా అంటేనే బోల్డ్ కామెంట్స్ కి కేరాఫ్ అడ్రెస్. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ తన గురించి ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చింది. అసలు తనంత గొప్ప నటి ఈ భూమి మీద ఎవరూ లేరని తనకి తానే చాటి చెప్పుకుంది. ట్వీట్ చేస్తూ.. ఒక వైపు ‘తలైవి’ సినిమాలో జయలలితగా నటిస్తున్న ఫోటోని, మరోవైపు ‘ధాకాడ్’ సినిమాలో యాక్షన్ హీరోయిన్ గెటప్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ మొత్తానికి తన గురించి తానే గొప్పగా చెప్పుకుని మురిసిపోయింది.

    Also Read: ప్రభాస్ కోసం మార్షల్ ఆర్టిస్ట్స్ కావాలట !

    కాగా కంగనా మాటల్లోనే “ఒక నటిగా నేను చూపే వైవిధ్యం ఈ ప్రపంచంలో ఏ నటి కూడా చూపలేదు. నాలాంటి రేంజ్ ఏ నటికీ లేదు. మెరిల్ స్ట్రీప్ అంత ప్రతిభ నాలో ఉంది. పైగా నేను గోల్ గోదాత్ లాగా యాక్షన్ స్టంటులు కూడా చెయ్యగలను’ అంటూ తన డబ్బా తానూ పరిపూర్ణంగా కొట్టుకుంది. అసలు కంగనాకి పిచ్చో లేదా బలుపో అర్ధం కాక, నెటిజన్లు కంగనా పై విరుచుకుపడుతున్నారు. మెరిల్ స్ట్రీప్ తో నిన్ను నువ్వు ఎలా పోల్చుకుంటావు అంటూ ఆమెను నీచంగా తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: అఘోరాగా బాలయ్య.. పిక్ వైరల్ ?

    ఇక తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కంగన నటిస్తోంది. అమ్మ జయలలిత జీవితం ఆధారంగా రానున్న ఈ బయోపిక్ ను ‘తలైవి’ అనే టైటిల్ తో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నాడు. ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా, మరి జయలలితగా ఎలా మెప్పిస్తోందో. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రాశారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

    Tags