Chandrababu Call To Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి..ఉత్తరాంధ్ర ప్రాంతం లో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తుంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం..నిన్న అర్థరాత్రి పవన్ కళ్యాణ్ బస చేస్తున్న నోవోటల్ హోటల్ లోకి పోలీసులు చొరబడి, ప్రతి రూమ్ ని సోడా చేసి పవన్ కళ్యాణ్ , నాగబాబు మరియు నాదెండ్ల మనోహర్ ని మినహియించి జనసేన పార్టీ నాయకులందరినీ అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేసిన గత పెను దుమారమే రేపింది..జనసేన లీడర్స్ మొత్తాన్ని అరెస్ట్ చెయ్యడం తో పవన్ కళ్యాణ్ ఈరోజు జరగాల్సిన జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేసాడు..పోలీసులు కూడా పవన్ కళ్యాణ్ వెంటనే వైజాగ్ వదిలి హైదరాబాద్ కి తిరిగి వెళ్లిపోవాలని 41A నోటీసులు కూడా జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ యంత్రాంగం..అయితే అరెస్ట్ అయినా జనసేన నాయకులందరినీ విడుదల చేస్తే తప్ప ఇక్కడి నుండి కదిలేదు లేదని పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పి ఇప్పటికి వైజాగ్ లోనే ఉంటున్నాడు.
అయితే పవన్ కళ్యాణ్ పై మరియు జనసేన నాయకులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్ర బాబు నాయుడు చాలా తీవ్రంగా స్పందించారు..అంతే కాకుండా ఆయన పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి ‘ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే ఈ దుర్మార్గులు తట్టుకోలేకపోతున్నారు..మీ పట్ల మీ పార్టీ పట్ల పోలీసు యంత్రాంగం ని వాడి దుర్వినియోగం చెయ్యడం దుర్మార్గం..దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను..ఒకవేళ జనసేన నాయకులను వదలని పక్షం లో నేను కూడా వైజాగ్ కి వచ్చి ఉద్యమం లో పాల్గొంటాను’ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో ఫోన్ కాల్ సంభాషణ చేసాడట..తనకి మద్దతు తెలిపినందుకు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా లో కృతఙ్ఞతలు తెలియచేసాడు..
అంతే కాకుండా తన మద్దతు తెలిపిన బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకి, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ రెడ్డి కి,సిపిఐ నేత నారాయణ కి మరియు తనకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను అంటూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసాడు పవన్ కళ్యాణ్.