Modi Speaks: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకనుగుణంగానే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో బలపడుతూ వస్తోంది. ఉత్తరాదిలో బీజేపీ బలమైన శక్తిగా ఉండగా దక్షిణాదిలో పార్టీ ఇంకా బలోపేతం కావాల్సి ఉంది. ఈక్రమంలోనే బీజేపీ అధిష్టానం దక్షిణాదిపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే ప్రధాని మోదీ దక్షిణాదిలో కీలమైన తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ఎంపీలతో నేడు భేటి కాబోతున్నారు.
దక్షిణాదిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే అంశాలపై చర్చించేందుకు ప్రధాని మోదీ నేరుగా ఎంపీలకు బ్రేక్ ఫాస్ట్ ఇస్తున్నారు. మోదీ ప్రధాని అయ్యాక తొలిసారి దక్షిణాది బీజేపీలతో ప్రత్యేకంగా భేటి అవుతున్నారని తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను బీజేపీ నేతలు మోదీకి వివరిస్తారా? లేదంటే అంతా బాగానే ఉందని చెబుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ తోపాటు బీజేపీ పలు హామీలు ఇచ్చింది. ఆ తర్వాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక విభజన హామీలను పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు విన్పిస్తున్నారు. ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు పెండింగ్ లో ఉన్నాయి.
సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పూనుకోవడంతో ఆపార్టీకి అక్కడి ప్రజలు ఘోరికట్టారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటికే ఆపార్టీ బలపడే అవకాశాలు ఏమాత్రం కన్పించడం లేదు. మరోవైపు బీజేపీ విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో వీరంతా బీజేపీ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మోదీకి కోరుతారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన ప్రతీ ఎన్నికలోనూ ఆపార్టీని విజయం సాధిస్తూ వెళుతోంది. బీజేపీ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోతుంది. ఈనేపథ్యంలో వాస్తవ పరిస్థితులను ఎంపీలు మోదీకి వివరించే దమ్ముందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈరోజు భేటీలో సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి, సత్యమూర్తి, కన్నా లక్ష్మీనారాయణ హాజరు కాబోతున్నారు.
Also Read: విషాదం.. కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదివరకు పోరాడిన వీరుడు?
వీరిలో టీజీ వెంకటేష్ కు మాత్రమే జనాల్లో క్రేజ్ ఉంది. ఆయనొక్కడే ఎమ్మెల్యేగా గతంలో రెండు, మూడుసార్లు గెలిచారు. మిగిలిన వారిలో ఎవరికీ జనాలతో ప్రత్యక్ష సంబంధాలు లేవు. వీళ్ళవల్ల పార్టీకి పట్టుమని వంద ఓట్లు కూడా వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి. దీంతో మోదీ వీరితో ఎన్నిసార్లు భేటిలు జరిపినా పెద్దగా ప్రయోజనం ఉండదనే టాక్ విన్పిస్తోంది. తెలంగాణలో మాత్రం బీజేపీ బలపడుతోంది. టీఆర్ఎస్ కు ధీటుగా ఇక్కడ పార్టీ బలపడుతుండటం బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్లస్ అయ్యే అవకాశం కన్పిస్తోంది.
ఇదిలా ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వచ్చే ఎన్నికల సమయంలో ప్రజలకు వెళ్లే పరిస్థితి లేదు. అలా వెళితే జనాలు దగ్గరకు తీసే పరిస్థితి ఉండదు. దీంతో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చి జనాలకు వద్దకు వెళితే ప్రయోజనం ఉంటుందని నేతలను నమ్ముకుంటే లాభం ఉండదనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంతో ప్రధానితో ఎంపీల భేటి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటి తర్వాత మరిన్ని విషయాలు క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది.
Also Read: పీకే టీంలో ఏపీలో పని చేయలేక పోతుందా?