https://oktelugu.com/

Lavanya Tripathi: అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పుట్టినరోజు నేడు

Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన అందంతో పాటు అభినయంతో స్పెషల్​ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్​ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించినప్పటికీ.. భలేభలే మగాడివోయ్​ సినిమాతో మంచి ఫేమ్ దక్కించుకుంది. ఈ రోజు లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆమె సినీ కెరీర్​తో పాటు వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు తెలుసుందాం. ఆమె పుట్టిన రోజు సందర్భంగా సోషల్​మీడియా వేదికగా అభిమానులు, సెలబ్రిటీల నుంచి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 12:55 PM IST
    Follow us on

    Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన అందంతో పాటు అభినయంతో స్పెషల్​ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్​ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించినప్పటికీ.. భలేభలే మగాడివోయ్​ సినిమాతో మంచి ఫేమ్ దక్కించుకుంది. ఈ రోజు లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆమె సినీ కెరీర్​తో పాటు వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు తెలుసుందాం.

    Lavanya Tripathi

    ఆమె పుట్టిన రోజు సందర్భంగా సోషల్​మీడియా వేదికగా అభిమానులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో అతికొద్ది మంది అద్భుతమైన హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. అయితే, వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. అన్ని సినిమాలు విజయాన్ని అందుకుంటున్నప్పటికీ.. వ్యక్తిగతంగా లావణ్యకు స్టార్​ హీరోయిన్​ ఇమేజ్​ మాత్రం దక్కడం లేదు. దీని గురించే ఆమెను ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. ఎందులో పడితే అందులో నటించడం కంటే.. ఇంట్లో కూర్చోవడం బెటర్ అని కరాఖండిగా సమాధానమిచ్చింది. ప్రస్తుతం లావణ్య తెలుగు, తమిళ భాషల్లో విభిన్న పాత్రల్లో నటిస్తోంది.

    Also Read: త్వరలో నటిగా పరిచయం కానున్న మిస్​ యూనివర్స్​.. ఇప్పటికే రెండు సినిమాలకు సైన్

    స్క్రిప్ట్​ నచ్చితే ఆ సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా రెడీ అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల దక్షిణాది సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్న లావణ్య.. డేట్​లు కుదరక బాలీవుడ్​లో వచ్చిన అవకాశాలను వదులుకుందట.

    కాగా, తెలుగులో ఇటీవలే అర్జున్​ సురవరం విజయం తర్వాత 2021లో ఏ1 ఎక్స్​ప్రెస్​, చావుకబురు చల్లగా వంటి చిత్రాలతో మంచి హిట్​ అందుకుంది. అందులో రావణ్య త్రిపాఠి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా చవుకబురు చల్లగా సినిమాలో భర్త లోి పాత్రలో డీ గ్లామర్​గా కనిపించడం విశేషం. ఇలా వరుసగా నచ్చిన ప్రాజెక్టుల్లోనే నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్​ను సంపాదించుకుంది లావణ్య.

    Also Read: ఆ విషయంలో మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా- సాయిపల్లవి