Pushpa: పుష్పకు కష్టాలు మొదలయ్యాయి.. అల్లు అర్జున్ స్వయంకృపరాధం!

Pushpa:  అల వైకుంఠపురంలో మూవీ విజయం అల్లు అర్జున్ లో ఎనలేని ఆత్మవిశ్వాసం తెచ్చిపెట్టింది. అందుకే లోకల్ ప్రాజెక్ట్ గా మొదలైన పుష్ప ను పాన్ ఇండియాగా మార్చేశారు. ఒక భాగాన్ని రెండు భాగాలుగా… వంద కోట్ల బడ్జెట్ ను రెండు వందల కోట్లు చేశారు. హీరోగా మరో స్థాయికి వెళ్లాలనుకోవడంలో తప్పులేదు. దాని కోసం వేసే అడుగులు, ప్రణాళికలు కూడా జాగ్రత్తగా వేయాలి.అల్లు అర్జున్ ఈ విషయంలో వెనుకబడినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. పాన్ ఇండియా విజయం […]

Written By: Shiva, Updated On : December 15, 2021 1:08 pm
Follow us on

Pushpa:  అల వైకుంఠపురంలో మూవీ విజయం అల్లు అర్జున్ లో ఎనలేని ఆత్మవిశ్వాసం తెచ్చిపెట్టింది. అందుకే లోకల్ ప్రాజెక్ట్ గా మొదలైన పుష్ప ను పాన్ ఇండియాగా మార్చేశారు. ఒక భాగాన్ని రెండు భాగాలుగా… వంద కోట్ల బడ్జెట్ ను రెండు వందల కోట్లు చేశారు. హీరోగా మరో స్థాయికి వెళ్లాలనుకోవడంలో తప్పులేదు. దాని కోసం వేసే అడుగులు, ప్రణాళికలు కూడా జాగ్రత్తగా వేయాలి.అల్లు అర్జున్ ఈ విషయంలో వెనుకబడినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. పాన్ ఇండియా విజయం అంటే… బాలీవుడ్ విజయం అని చెప్పాలి. దేశంలోనే అతిపెద్ద సినిమా మార్కెట్ గా బాలీవుడ్ ఉంది. కాబట్టి అక్కడ సక్సెస్ అయిన హీరోలకు తిరుగుండదు. దానికి రజినీకాంత్, ప్రభాస్ వంటివారు ఉదాహరణ. బాహుబలి సిరీస్ తో పాటు సాహో విజయం సాధించడంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హోదా అధికారికం చేసుకున్నాడు.

Pushpa

ఆయన ప్రకటిస్తున్న వందల కోట్ల ప్రాజెక్ట్స్ ఆయన సక్సెస్ కి నిదర్శనం. ప్రభాస్ రేంజ్ పాపులారిటీ తెచ్చుకోవాలని ఆశపడుతున్న అల్లు అర్జున్ పుష్ప మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాగే సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మన కష్టం, సినిమాలో ఉన్న విషయం జనాలకు తెలియాలంటే ప్రమోషన్స్ చాలా అవసరం. సినిమాలో మ్యాటర్ ఉన్నప్పటికీ, ప్రేక్షకులకు తెలిసేలా చేయకపోతే దాని వలన ప్రయోజనం ఉండదు. పుష్ప మూవీకి ఇదే పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రమోషన్స్ విషయంలో పుష్ప టీమ్ పూర్తిగా విఫలం చెందినట్లు అర్థమవుతుంది. హిందీలో పుష్ప కోసం కనీస ప్రమోషన్స్ నిర్వహించలేదు. సౌత్ లోని మిగతా భాషల పరిస్థితి కూడా ఇదే. హిందీలో పుష్ప చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అక్కడ ప్రేక్షకులు కనీస ఆసక్తి పుష్ప మూవీపై చూపలేదని అడ్వాన్స్ బుకింగ్స్ తెలియజేస్తున్నాయి. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ ల అంచనా ప్రకారం పుష్ప ఫస్ట్ డే ఓపెనింగ్స్ కోటి రూపాయలకు లోపే అంటున్నారు.

Also Read: Lavanya Tripathi: అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పుట్టినరోజు నేడు

ఇది పాన్ ఇండియా సినిమాకు అవమానమే అని చెప్పాలి. ఈ వైఫల్యం కేవలం పుష్ప టీమ్ స్వయంకృపరాధం. హీరో అల్లు అర్జున్ తో పాటు పుష్ప మూవీ టీమ్ లో ఎవరికీ బాలీవుడ్ లో గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలో విరివిగా ప్రమోషన్స్ నిర్వహించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. దాని ఫలితమే హిందీ వర్షన్ కి వస్తున్న పూర్ ఓపెనింగ్స్.

Also Read: Rashmika: ‘రారా సామీ’ స్టెప్పులతో ఇన్​స్టాలో రష్మిక వీడియో పోస్ట్​.. లక్షల్లో లైక్​లు

Tags