రాబోయే 4 నెలలు జాగ్రత్త.. థర్డ్ వేవ్ పై కేంద్రం హెచ్చరికలు

దేశంలో కరోనా మహమ్మారిపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సెకండ్ వేవ్ ఇంకా తగ్గిపోలేదని చెబుతుండడంతో ఆందోళన ఇంకా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో మూడో దశ ముప్పు కూడా ఉందని హెచ్చరికలు వస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాబోయే 100 నుంచి 125 రోజులు దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు కరోనా వైరస్ వ్యాప్తిపై జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. దేశంలో మూడో దశ ప్రారంభమైందా లేదా అన్నది ఇంకా తెలియడం […]

Written By: Srinivas, Updated On : July 17, 2021 11:56 am
Follow us on

దేశంలో కరోనా మహమ్మారిపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సెకండ్ వేవ్ ఇంకా తగ్గిపోలేదని చెబుతుండడంతో ఆందోళన ఇంకా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో మూడో దశ ముప్పు కూడా ఉందని హెచ్చరికలు వస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాబోయే 100 నుంచి 125 రోజులు దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు కరోనా వైరస్ వ్యాప్తిపై జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

దేశంలో మూడో దశ ప్రారంభమైందా లేదా అన్నది ఇంకా తెలియడం లేదు. రానున్న 100-125 రోజులు చాలా కీలకమని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రపంచ దేశాలన్ని మూడో దశ ముప్పుపై ఆందోళన చెందుతున్నాయని చెప్పారు. కరోనా దశలు ముఖ్యం కాదని వాటిని మనం ఎదుర్కొనే దానిపై శ్రద్ధ వహించాలని సూచించారు. కరోనా పరిస్థితిని మనం జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పారు.

ప్రజలు మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం నిబంధనలు అవలంభిస్తూ ఉండాలని చెబుతున్నారు. దేశంలోని 47 జిల్లాల్లో కరోనా పాజిటివ్ రేటు పది శాతానికి పైగా ఉందని తెలిపారు. మూడో దశ ముప్పును ఎదుర్కొనే అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. మనజనాభాకు కరోనా ముప్పు తొలగలేదని అన్నారు. సహజ హెర్డ్ ఇమ్యూనిటీకి మనం ఇంకా చేరలేదని సూచించారు. అందుకే నిరంతరం వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.

మూడో దశ అనుమానాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడో దశ ముప్పు రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. టెస్ట్ ట్రాక్ ట్రీట్ వ్యాక్సిన్ విధానాన్ని మరింత విస్తరించాలని అన్నారు.