టీకా తీసుకున్నాక కరోనా వస్తే..?

వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా ఈ మధ్య కరోనా వైరస్ మళ్లీ సోకుతోంది. నిజానికి రోగ నిరోధక శక్తి కరోనా వైరస్ ను అడ్డుకోవాలి. కానీ అలా జరగడం లేదు. దీనికి కారణాలను తాజాగా భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిగ్గు తేల్చింది. సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా టీకా తీసుకున్నాక ప్రధాన ధైర్యం ఏంటంటే ఈ కేసుల్లో మరణాలు తగ్గిపోతాయి. ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం కూడా తగ్గిపోతుందని ఐసీఎంఆర్ తేల్చింది. కరోనా టీకా తీసుకున్నాక కేవలం 9.8శాతం […]

Written By: NARESH, Updated On : July 17, 2021 2:42 pm
Follow us on

వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా ఈ మధ్య కరోనా వైరస్ మళ్లీ సోకుతోంది. నిజానికి రోగ నిరోధక శక్తి కరోనా వైరస్ ను అడ్డుకోవాలి. కానీ అలా జరగడం లేదు. దీనికి కారణాలను తాజాగా భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిగ్గు తేల్చింది. సంచలన విషయాలను వెల్లడించింది.

కరోనా టీకా తీసుకున్నాక ప్రధాన ధైర్యం ఏంటంటే ఈ కేసుల్లో మరణాలు తగ్గిపోతాయి. ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం కూడా తగ్గిపోతుందని ఐసీఎంఆర్ తేల్చింది. కరోనా టీకా తీసుకున్నాక కేవలం 9.8శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోందని.. 0.4 శాతం కేసుల్లోనే మరణం సంభవిస్తోందని తేలింది. దీన్ని టీకా తీసుకుంటే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం.. మరణాలు జయించవచ్చని అధ్యయనం తేల్చింది.

వ్యాక్సినేషన్ ను మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా కోవిడ్ తదుపరి థర్డ్ వేవ్ ను కూడా తగ్గించవచ్చని పేర్కొంది. వ్యాక్సిన్ అనంతరం ఇన్ ఫెక్షన్లపై ఐసీఎంఆర్ చేసిన ఈ పరిశోధనలో టీకాలు పొందినా కరోనా పాజిటివ్ గా తేలిన 677మందిని నమూనాలు సేకరించారు. 17 రాష్ట్రాల్లో ఇలాంటివి చోటుచేసుకున్నట్టు తేలింది.

అయితే రెండోసారి పాజిటివ్ రావడానికి డెల్టా వేరియంట్ కారణమని తేల్చారు. ఈ రకం వైరస్ బారిన ఏకంగా 86.09 శాతం పడ్డారని తేలింది. ఈ రకం వైరస్.. మార్చి-జూన్ నెలలో సామాజిక వ్యాప్తి స్థాయిలో సంక్రమించిందని తేలింది. ఆల్ఫా, కప్పా వేరియంట్ల ప్రభావం తక్కువని తేలింది.

దీన్ని బట్టి టీకాలు సురక్షితమని.. తీవ్ర ఇనెఫెక్షన్ ను నివారించడంలో సమర్థంగా పనిచేస్తున్నట్లు స్పష్టమైందని నీతి అయోగ్ ప్రకటించింది.