Aadhaar Voter ID linking: కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రతిపక్షాల గోలను తోసిరాజని ఓటరు ఐడీ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసే చట్టానికి రూపకల్పన చేసింది. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర దుమారం రేపాయి. బిల్లును ఏకపక్షంగా ఆమోదం తెలపడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించాయి. పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగించే బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వం మాత్రం వాటి విమర్శలను లెక్కలోకి తీసుకోలేదు. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదింపజేశారు.

ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ని సోమవారం లోక్ సభలో ఆమోదం పొందింది. ఇకపై ప్రతి ఏటా నాలుగు సార్లు ఓటరు నమోదు, మహిళా సర్వీస్ అధికారిణిల భర్తలకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం, ఎన్నికల కమిషన్ పరిధిని విస్తృతం చేసే కీలక అంశాలు ఇందులో ఉన్నాయి. దీంతో మిగతా మూడు అంశాలపై ఆక్షేపణలు చేయకున్నా ఓటరు జాబితాను ఆధార్ తో అనుసంధానం చేసే బిల్లుపై మాత్రం విపక్షాలు మండిపడుతున్నాయి.
అయితే గత వారమే లోక్ సభ ఆమోదం పొందిన బిల్లును ప్రతిపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించినా ప్రయోజనం లేకుండా పోయింది. బిల్లు ఆమోదంతో పౌరుల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లున స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
Also Read: KCR on BJP : కేసీఆర్ సారు ఆదేశించడాలేనా..? పాటించడాల్లేవా??
ఆధార్ కార్డు లేని వారు ఎంతో మంది ఉన్నారని ఇప్పుడు వారందరికి ఓటు హక్కు దూరం అయ్యే అవకాశం ఏర్పడింది. ఆధార్ ను అనుసంధానం చేయడం ద్వారా పౌరుల హక్కులు హరించే వీలుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాల గోలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని తెలుస్తోంది. దీంతో ఓటరు కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం చేసే బిల్లును ప్రభుత్వం ఏ మేరకు విజయవంతం చేస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read: Omicron: ఒకరోజు 10వేల కేసులు.. దేశంలో థర్డ్ వేవ్ తప్పదా?