పదినెలల్లో పెట్రో బాదుడు.. రూ.5లక్షల కోట్లు..

దేశ ప్రజల నడ్డి విరుస్తున్న పెట్రో ధరలు కేంద్రానికి మాత్రం మంచి ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. దేశ ప్రజలు పెట్రోలు, డీజిల్ కు పన్ను రూపంలో పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నారు. ఇది ప్రజలు కట్టే ఆదాయపు పన్ను మాత్రమే.. జీస్టీలకు అదనం. జీఎస్టీలు కాకుండా దేశ ప్రజలు పదినెలల్లో రూ.5 లక్షల కోట్ల వరకు పన్నుల రూపంలో చెల్లించారు. లీటరు పెట్రోలుకు రాష్ట్ర ప్రభుత్వాలు వేసే వ్యాట్ ఇందులో అదనం. కేంద్ర ప్రభుత్వం ఈ లెక్కన పదినెలల్లో రూ.రెండు […]

Written By: Srinivas, Updated On : March 23, 2021 11:06 am
Follow us on


దేశ ప్రజల నడ్డి విరుస్తున్న పెట్రో ధరలు కేంద్రానికి మాత్రం మంచి ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. దేశ ప్రజలు పెట్రోలు, డీజిల్ కు పన్ను రూపంలో పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నారు. ఇది ప్రజలు కట్టే ఆదాయపు పన్ను మాత్రమే.. జీస్టీలకు అదనం. జీఎస్టీలు కాకుండా దేశ ప్రజలు పదినెలల్లో రూ.5 లక్షల కోట్ల వరకు పన్నుల రూపంలో చెల్లించారు. లీటరు పెట్రోలుకు రాష్ట్ర ప్రభుత్వాలు వేసే వ్యాట్ ఇందులో అదనం.

కేంద్ర ప్రభుత్వం ఈ లెక్కన పదినెలల్లో రూ.రెండు లక్షల 94వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ లెక్క లీటరుకు రూ.32.90 పన్ను కేద్రం వసూలు చేస్తోంది. డీజిల్ పై 31.80 పన్ను వసూలు చేస్తోంది. అంటే ఒక్క లీటరుకు వందరూపాయలు పెట్టి పెట్రోలు కొంటే… అందులో రూ.33 కేంద్రం పన్నులు. ఇందులో సెస్సులు అదనం. రాష్ర్ట ప్రభుత్వాల వ్యాట్ అదనం. వారు వేసే అదనపు పన్నులు ఇంకా అదనం.

ఇవన్నీ చూస్తుంటే.. అసలు లీటరు పెట్రోలు ధర రూ.30 కూడా దాటే అవకాశం ఉండదు. అన్ని ప్రభుత్వం ఇంత పన్ను వసూలు చేయలేదు. కేవలం ఒక్క బీజేపీ సర్కారు మాత్రమే ఈ తాట తీసేంత వసూళ్లు చేస్తోంది. 2014..15లో పెట్రో పన్ను ద్వారా కేంద్రానికి వచ్చింది రూ.70వేల కోట్లకు అటు.. ఇటుగా… ఈ ఆర్థిక సంవత్సరం పదినెలల్లో వచ్చింది రూ.2.94 కోట్లు. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ఈ లెక్కలను విడుదల చేసింది.

కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ పై ఎక్సయిజ్ సుంకం తొమ్మిది రూపాయలు ఉండేది. డీజిల్ పై రూ. మూడున్నర ఉండేది. ఇప్పడు అది ముప్పయి రూపాయాలు దాటించేశారు. ఈ లెక్కన పెట్రోల్ ధరలో 60శాతం, డీజిల్ ధరలో 53శాతం పన్నుల వాటానే ఉంటోంది. లాక్ డౌన్ కారణగా ప్రజలు ఆర్థికంగా తీవ్రమైన కష్టాలు పడుతున్నా.. వారి ఆదాయం పెంపుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేయని ప్రభుత్వం పెట్రో పన్నులు మాత్రం ఆత్మనిర్బర్ పేరుతో భారీగానే వడ్డించింది.