https://oktelugu.com/

ఇంగ్లండ్ తో టీమిండియా ఢీ: మార్పులు చేర్పులు.. వ్యూహాలు

టెస్టు, టీ20 సిరీస్ ల విజయాలతో జోరు మీద భారత్ ఉండగా.. ప్రపంచ నంబర్ 1 టీం అయ్యిండి ఓడిపోయిన ఇంగ్లండ్ కసితో బరిలోకి దిగుతోంది. మధ్యాహ్నం 1.30కి ప్రారంభమయ్యే ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కోసం టీమిండియా సర్వసన్నద్ధంగా ఉంది. అన్ని రంగాల్లో కనిపిస్తున్న రెండు టీంలు కసిగా ఆడనున్నాయి. ఒక్క సిరీస్ గెలిచి అయినా స్వదేశానికి వెళ్లాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది. మంగళవారం ఫూణేలోని (ఎంసీఏ)లో ఇంగ్లండ్, భారత్ తొలి వన్డే జరుగుబోతోంది. పిచ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 23, 2021 / 10:54 AM IST
    Follow us on

    టెస్టు, టీ20 సిరీస్ ల విజయాలతో జోరు మీద భారత్ ఉండగా.. ప్రపంచ నంబర్ 1 టీం అయ్యిండి ఓడిపోయిన ఇంగ్లండ్ కసితో బరిలోకి దిగుతోంది. మధ్యాహ్నం 1.30కి ప్రారంభమయ్యే ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కోసం టీమిండియా సర్వసన్నద్ధంగా ఉంది. అన్ని రంగాల్లో కనిపిస్తున్న రెండు టీంలు కసిగా ఆడనున్నాయి. ఒక్క సిరీస్ గెలిచి అయినా స్వదేశానికి వెళ్లాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది.

    మంగళవారం ఫూణేలోని (ఎంసీఏ)లో ఇంగ్లండ్, భారత్ తొలి వన్డే జరుగుబోతోంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించనుంది. ఇంగ్లండ్ టీం రాయ్, బట్లర్, బెయిర్ స్టో , మోర్గాన్, స్టోక్స్, బిల్లింగ్స్ వంటి బలమైన ఆటగాళ్లతో దుర్భేద్యంగా ఉంది. ఇక బుమ్రా, షమీ లేని భారత బౌలింగ్ దళానికి భువనేశ్వర్ నాయకత్వం వహిస్తాడు.నటరాజన్, శార్ధూల్ ఠాకూర్, స్పిన్నర్లు చాహల్, సుందర్ లు బలంగా ఉన్నారు.

    పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించడం ఖాయంగా కనిపించడంతో మొదట బ్యాటింగ్ చేసే జట్టు 350 పరుగులు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ కు బౌలింగ్ బలహీనంగా ఉండగా.. ఇంగ్లండ్ కు అర్చర్ దూరమవ్వడం దెబ్బ తీసింది. వుడ్ కు తోడుగా మంచి బౌలర్లు లేరు. స్పిన్నర్ రషీద్ పై ఆశలు పెట్టుకున్నారు.

    ఇక బ్యాటింగ్ లో రోహిత్ తో కలిసి శిఖర్ ధావన్ బ్యాటింగ్ చేస్తాడని కోహ్లీ ప్రకటించాడు. దీంతో కేఎల్ రాహుల్ కు తుది జట్టులో చోటు కష్టమేనంటున్నారు. ఆరోస్థానంలో ఆడిస్తారా? పంత్ కు చాన్స్ ఇస్తారా చూడాలి. స్పిన్ ఆల్ రౌండర్లు అయిన కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ లలో ఒకరికి చాన్స్ దక్కొచ్చు.