https://oktelugu.com/

Debts of Telangana : అప్పుల కుప్ప.. ఇదీ కేసీఆర్ సర్కార్ లెక్క..

బంగారు తెలంగాణ అప్పుల తెలంగాణ అయ్యిందని కొందరు.. కేసీఆర్ ఏకంగా రెండున్నర లక్షల కోట్ల అప్పు చేశాడని ఇంకొందరు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సైతం ఇవ్వలేకపోతున్న కేసీఆర్ తీరు చూసి అందరూ ఒకటే ఆడిపోసుకుంటున్నారు. ఇంతకీ కేసీఆర్ చేసిన అప్పు ఎంత? అది ఎంత కుప్ప అయ్యిందన్న దానిపై ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా తెలంగాణ సర్కార్ కు ఉన్న అప్పు ఎంతో అణాపైసలతో సహా కేంద్రం బయటపెట్టింది. అదే వైరల్ అయ్యింది. 2014 తెలంగాణ ఏర్పడే […]

Written By:
  • NARESH
  • , Updated On : February 13, 2023 / 05:55 PM IST
    Follow us on

    బంగారు తెలంగాణ అప్పుల తెలంగాణ అయ్యిందని కొందరు.. కేసీఆర్ ఏకంగా రెండున్నర లక్షల కోట్ల అప్పు చేశాడని ఇంకొందరు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సైతం ఇవ్వలేకపోతున్న కేసీఆర్ తీరు చూసి అందరూ ఒకటే ఆడిపోసుకుంటున్నారు. ఇంతకీ కేసీఆర్ చేసిన అప్పు ఎంత? అది ఎంత కుప్ప అయ్యిందన్న దానిపై ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా తెలంగాణ సర్కార్ కు ఉన్న అప్పు ఎంతో అణాపైసలతో సహా కేంద్రం బయటపెట్టింది. అదే వైరల్ అయ్యింది.

    2014 తెలంగాణ ఏర్పడే నాటికి అప్పు రూ.75వేల కోట్లుగా ఉంటే.. తమ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.49 లక్షల కోట్లు అని చెప్పారు. ఈ రుణం మొత్తాన్ని ప్రాజెక్టులు, మౌలిక వసతులకు ఖర్చు చేశానని.. పెట్టుబడి వ్యయం అంటూ అప్పులను కూడా కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు కేసీఆర్. కానీ అప్పుడు మాత్రం 4.33 లక్షల కోట్లు అని కేంద్రం సంచలన విషయాన్ని బయటపెట్టింది.

    కాళేశ్వరం కట్టాను.. కరెంట్ ఇచ్చాను.. అంతా బాగుందని.. ధనిక రాష్ట్రం అంటున్న కేసీఆర్ సర్కార్ ను లెక్కలతో కొట్టింది కేంద్రం. అవును. తాజాగా తెలంగాణకు ఉన్న అప్పులను లెక్కలతో సహా కేంద్రం బయటపెట్టింది. ఈ అప్పులను అడిగింది కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాగా.. బదులిచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. మొత్తం కేసీఆర్ సర్కార్ అప్పుల కుప్ప మాత్రం బయటపడింది. ఇప్పట్లో ఇంతటి అప్పులను తీర్చడం మాత్రం సాధ్యం కాదన్న విషయం వెలుగుచూసింది.

    తెలంగాణ వచ్చాకనే కేసీఆర్ సీఎం అయ్యాకే అప్పులు భారీగా పెరిగాయని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టింది. స్వరాష్ట్రంలోనే 2022 అక్టోబర్ నాటికి రూ.4.33 లక్షల కోట్ల అప్పు ఉందని సంచలన నిజాన్ని బయటపెట్టింది. . రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కలిపి చేసిన అప్పులుగా వీటిని పేర్కొంది.రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం నాటికి రూ.75577 కోట్ల అప్పులుంటే.. 2021-22 నాటికి అవి రూ.2,83,452 కోట్లకు చేరాయన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖకు ప్రభుత్వ రంగ బ్యాంకులు నివేదించినట్లు చెప్పారు.

    ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు రూ.1.50 లక్షల కోట్లు, 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పులు రూ.1.30 లక్షల కోట్లుగా ఉన్నాయని పంకజ్ చౌదరి వెల్లడించారు.

    తెలంగాణ ఓ వైపు ధనిక రాష్ర్టంగా చెబుతున్నా అప్పులు కూడా అదే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన వివరాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. తెలంగాణ ధనిక రాష్ర్టమని చెప్పుకునే కేసీఆర్ ఈ అప్పులపై ఏం సమాధానం చెబుతారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.