https://oktelugu.com/

Kishan reddy Jan Ashirwad Yatra:ఏపీకి పోటు పొడిచిన కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy ) జన ఆశీర్వాద యాత్ర (Jan Ashirwad Yatra) మొదలైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అప్పుడే మాటల దాడిని మొదలుపెట్టారు. ఏపీలోని జగన్ సర్కార్ టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. రాజకీయ స్వార్థంతో కొన్ని పార్టీలు రైతులను అడ్డంపెట్టుకుని నాటకాలు ఆడుతున్నాయనీ.. రైతులకు అనుగుణంగా చట్టాలను తీసుకువస్తే రాజకీయ స్వార్థంతో ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 19, 2021 1:03 pm
    Follow us on

    కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy ) జన ఆశీర్వాద యాత్ర (Jan Ashirwad Yatra) మొదలైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అప్పుడే మాటల దాడిని మొదలుపెట్టారు. ఏపీలోని జగన్ సర్కార్ టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. రాజకీయ స్వార్థంతో కొన్ని పార్టీలు రైతులను అడ్డంపెట్టుకుని నాటకాలు ఆడుతున్నాయనీ.. రైతులకు అనుగుణంగా చట్టాలను తీసుకువస్తే రాజకీయ స్వార్థంతో ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

    జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.  అమర జవానుల స్తూపం వద్ద అమర జవాన్లకు నివాలులు అర్పించి యుద్ధవీరులకు సన్మానం చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోందని అన్నారు. రాష్ట్ర వాటా నిధులు లేక కొన్ని కేంద్ర పథకాల పనుల్లో జాప్యం జరుగుతోందని విమర్శించారు.

    కేంద్ర కేబినెట్ లో మోడీ అన్ని వర్గాలకు సమ న్యాయం చేశారని కిషన్ రెడ్డి అన్నారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ముందుగా శ్రీవారి అసీసులు తీసుకుని ప్రజల ఆశీర్వాదం కోసం ప్రజల్లోకి వెళుతున్నానన్నారు. బీజేపీ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా రైతులకు న్యాయం జరిగేవిధంగా సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. కేంద్రం పెడరల్ సిస్ట్టం తీసుకురావడంతో బీసీలకు న్యాయం జరిగిందనీ బిసి కమీషన్ ను తీసుకువచ్చింది మోడీయే నన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్ లోనే జరుగుతుందని మోడీ నాయకత్వంలో వ్యాక్సిన్ ను కనుగొన్నామని మనమేనన్నారు.

    కేంద్ర పథకాలు మినహా అసలు ఏపీలో అభివృద్ధి జరగట్లేదు. జలవివాదాలను తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలనేది కేంద్రం భావన.

    ఇప్పటికే కేంద్రం ఏపీకి భారీ సాయం చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో ఏపీకి 4500 వెంటిలేటర్లు, ఇంజెక్షన్లను కేంద్రం పంపిందని తెలిపారు. రాష్ట్రానికి అనేక విద్యాసంస్థలను మంజూరు చేసిందన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అభివృద్ధి చేశామన్నారు.

    ఇలా తొలి పర్యటనలోనే ఏపీలోని జగన్ సర్కార్ ను టార్గెట్ చేసి కిషన్ రెడ్డి పర్యటన సాగింది. ఆ తర్వాత తెలంగాణలోనూ ఇదే వేడి కొనసాగిస్తారా? కేసీఆర్ ను టార్గెట్ చేస్తారా? అన్నది వేచిచూడాలి.

    థర్డ్  వేవ్ రాకుండా ఉండాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని వేంకటేశ్వర స్వామినీ ప్రార్థించానని.. ఎన్ని కోట్లు ఖర్చు అయినా చివరి వ్యక్తి వరకు వ్యాక్సిన్ అందిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్స్, ఇంజక్షన్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ కు అందించామని..  అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం అభివృద్ధి చేస్తుందన్నారు.

    మనం తెలుగు వాళ్ళము మనమధ్య విభేదాలు ఉండకూడదనీ నది జల్లాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరిస్తామని కిషన్ రెడ్డి అన్నారు.  కరోనా తగ్గిన తర్వాత ప్రపంచ మంతా మన దేశానికి వచ్చే విధంగా టూరిజంను ప్రోత్చహిస్తామని తెలిపారు.