https://oktelugu.com/

బిగ్‌బాస్‌ రన్నరప్‌ కోసం హోరాహోరీ

ఎలాంటి భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌.. చెప్పుకోదగ్గ ఫేమ్‌ కంటెస్టులు లేకుండానే బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ముగింపు దశకు చేరింది. ఈ ఆదివారం బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ముగియనుంది. మరి ఈ సీజన్‌కు గాను ఎవరు విన్నర్‌‌ కాబోతున్నారనేది ఇప్పుడు అంతటా ఆసక్తిగా మారింది. ఫైనల్‌ను నిర్ణయించేందుకు ఓటింగ్‌ లైన్‌ కూడా శుక్రవారంతో ముగియనుంది. ఈ క్రమంలో తన అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించుకొనేందుకు ప్రేక్షకులు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. కొందరు కంటెస్టెంట్లు భారీ ఓటింగ్‌ను సంపాదించుకున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 18, 2020 / 11:00 AM IST
    Follow us on


    ఎలాంటి భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌.. చెప్పుకోదగ్గ ఫేమ్‌ కంటెస్టులు లేకుండానే బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ముగింపు దశకు చేరింది. ఈ ఆదివారం బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ముగియనుంది. మరి ఈ సీజన్‌కు గాను ఎవరు విన్నర్‌‌ కాబోతున్నారనేది ఇప్పుడు అంతటా ఆసక్తిగా మారింది. ఫైనల్‌ను నిర్ణయించేందుకు ఓటింగ్‌ లైన్‌ కూడా శుక్రవారంతో ముగియనుంది. ఈ క్రమంలో తన అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించుకొనేందుకు ప్రేక్షకులు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. కొందరు కంటెస్టెంట్లు భారీ ఓటింగ్‌ను సంపాదించుకున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

    Also Read: బిగ్ బాస్ చెక్ తో బంగారం కొన్న గంగవ్వ.. ఎంత ఇచ్చారో తెలుసా?

    బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ మొదలైనప్పటి నుంచి ఓటింగ్ విషయంలో అభిజిత్‌దే పైచేయి. మరే ఇతర కంటెస్టెంటు కూడా గత 14 వారాల్లో అభిజిత్‌ను మించి ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకోలేదు. ఇక అదే ప్రభంజనం 14 వారం కూడా కొనసాగుతున్నట్టు సమాచారం. 14వ వారంలో గురువారం రాత్రి వరకు అభిజిత్ టాప్ ‌పోజిషన్‌లో కొనసాగుతున్నాడు. ఓటైన మొత్తంలో దాదాపు సగానికిపైగా ఓట్లు అభిజిత్ ఖాతాలో పడ్డాయి. సుమారు 60 శాతం ఓట్లు అభిజిత్‌కే దక్కినట్టు తెలుస్తోంది.

    అభిజిత్‌కు యాప్ ద్వారా ఓటింగ్ విషయంలో ఎదురులేనప్పటికీ.. మిస్డ్ కాల్ డేటా విషయానికి వస్తే అభిజిత్‌కు కొంచెం గట్టిపోటీ ఎదురైనట్టు తెలుస్తోంది. మిస్డ్ కాల్ డేటాలో అరియానా గ్లోరి ముందు ఉన్నట్టు సమాచారం. ఓటింగ్ పరంగా అరియానా ముందుకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక రెండో స్థానం కోసం సయ్యద్ సోహెల్ ర్యాన్, అరియానా గ్లోరి మధ్య భారీ పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. యాప్ ఓటింగ్ డేటా ప్రకారం సోహెల్ ముందున్నప్పటికీ.. మిస్డ్ కాల్ డేటా పరిగణనలోకి తీసుకొంటే అరియానాకు పాజిటివ్‌గా మారిందనే విషయం ఇప్పుడు చర్చగా మారింది.

    Also Read: క్రేజ్ పీక్స్, రిజల్ట్ షాక్… అక్కడ నాని ‘వి’ఫలమే!

    బిగ్‌బాస్ తెలుగు 4 విజేతగా అభిజిత్‌ అని ఇప్పటికే స్పష్టం అవుతుండగా.. రెండోస్థానంలో ఎవరు ఉంటారనే విషయంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. మిస్డ్ కాల్ డేటా, యాప్ డేటా పరిశీలిస్తే తక్కువ తేడాతో అరియానా గానీ, సోహెల్ గానీ రన్నరప్‌గా నిలుస్తారనే ఊహగానాలు కొనసాగుతున్నాయి. గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం కాబోతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    Tags