Central govt jobs recruitment 2025 : ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తాం.. దేశంలో నిరుద్యోగ రేటు తగ్గిస్తాం.. 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీ ఇది. ఈ హామీని నమ్మిన దేశంలోని యువత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి జై కొట్టారు. కానీ, హామీ నెరవేరలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మోదీ సర్కార్ ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టలేదు. కానీ, 2024 ఎన్నికల్లో నిరుద్యోగుల దెబ్బకు బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. అయితే మిత్రపక్షాల సహకారంతో మళ్లీ అధికారం చేపట్టింది. సీట్లు తగ్గడానికి కారణం గుర్తించిన మోదీ సర్కార్.. ఈసారి ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రైల్వే, పోస్టల్, బ్యాంకింగ్ రంగంలోని ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టింది. తాజాగా ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగ అవకాశాల పెంపే లక్ష్యంగా పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం రూపొందించింది. ఈ పథకం ఆగస్టు 1 నుంచి దేశంలో అములోకి రానుంది.
Also Read: జస్ట్ 35 సెకండ్లు రైలు ఆలస్యం.. ప్రయాణికులు అందరికీ టికెట్ డబ్బులు రిఫండ్
రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు..
రాబోయే రెండేళ్లలో పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకంలో 3.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకానికి రూ.99,446 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి, ఉద్యోగ సృష్టి చేసే సంస్థలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఆర్థిక వృద్ధిని, యువతకు ఉపాధిని కల్పించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో నమోదైన తొలి ఉద్యోగులపై దృష్టి సారిస్తుంది. ఈ విభాగంలో, ఉద్యోగులకు ఒక నెల జీతంలో గరిష్టంగా రూ.15 వేలు రెండు విడతల్లో చెల్లించబడుతుంది. మొదటి విడత 6 నెలల సేవ తర్వాత, రెండో విడత 12 నెలల సేవ, ఆర్థిక సాక్షరత కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత చెల్లించబడుతుంది.
Also Read: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలివే.. వీటిలో మీరు ఎన్నింటికి అర్హులు
తయారీ రంగంపై దృష్టి..
ఈ పథకం ద్వారా కేంద్రం తయారీ రంగంపై దృష్టి సారిస్తుంది, ఇది ’మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఈ పథకం 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు సృష్టించబడే ఉద్యోగాలకు వర్తిస్తుంది, ఇందులో 1.92 కోట్ల మంది తొలిసారి ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. చెల్లింపులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జరుగుతాయి.
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన వికసిత భారత్ దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ఈ పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడడమే కాకుండా, ఆర్థిక సాక్షరతను పెంపొందించడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చు.