Athadu Movie Casting: అతడు మూవీ థియేటర్స్ లోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది. కానీ ఇప్పటికీ అతడు ప్రేక్షకులకు ఫేవరేట్ మూవీ. ఈ సినిమాలో కీలక రోల్ కోసం ఓ సీనియర్ హీరోని సంప్రదించగా… నో చెప్పాడట. మహేష్(MAHESH BABU) సినిమాను కూడా రిజెక్ట్ చేసిన ఆ హీరో ఎవరో చూద్దాం..
దర్శకుడిగా త్రివిక్రమ్ కెరీర్ బిగినింగ్లో చేసిన చిత్రాల్లో అతడు(ATHADU) ఒకటి. మహేష్ బాబు-త్రిష జంటగా నటించారు. అతడు బుల్లితెర ప్రేక్షకుల ఆల్ టైం ఫేవరేట్. ఎన్ని సార్లు ప్రదర్శించినా రీజనబుల్ టీఆర్పీ అతడు సినిమా రాబడుతుంది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. సినిమా అద్భుతంగా ఉన్నప్పటికీ ఎందుకో జనాలకు పూర్తి స్థాయిలో ఎక్కలేదు. బుల్లితెర మీదకు వచ్చాక ఆ సినిమాలోని బ్యూటీ ప్రేక్షకులకు అర్థమైంది.
Also Read: వసూళ్ల లో వెనకబడుతున్న ‘మెగా’ సినిమాలు..
యాక్షన్ ఎపిసోడ్స్, మహేష్-త్రిష కెమిస్ట్రీ, బ్రహ్మానందం కామెడీ ఎపిసోడ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, మణిశర్మ సాంగ్స్ ఈ చిత్రానికి హైలెట్. ఫుల్ మీల్ వలె అన్ని హంగులతో త్రివిక్రమ్ అతడు చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రాన్ని నటుడు మురళీ మోహన్ నిర్మించడం విశేషం. కాగా అతడు మూవీలో హీరో తాతయ్య పాత్రను నాజర్ చేశారు. నాజర్ గొప్ప నటుడు. ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు.
అయితే ఈ పాత్రకు మొదట అనుకున్నది నాజర్ కాదట. హీరోగా రిటైర్ అయిన శోభన్ బాబును క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అతడు మూవీతో పరిచయం చేయాలని మురళీ మోహన్ అనుకున్నారట. హీరో తాతయ్య పాత్రకు శోభన్ బాబును అనుకుంటున్నాను… అని త్రివిక్రమ్ తో చెప్పాడట. అంతకంటే గొప్ప ఆప్షన్ ఏముంటుందని, త్రివిక్రమ్ అన్నారట. అయితే మురళీ మోహన్ నేరుగా శోభన్ బాబును అడగలేకపోయాడట. తన అసిస్టెంట్ కి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి చెన్నై పంపించాడట. ఎన్టీఆర్, అమితాబ్ చేస్తున్నారు కదా, ఆయన కూడా చేస్తారులే అనుకున్నారట.
Also Read: ‘అజ్ఞాతవాసి’ ని మించిన డిజాస్టర్..’హరి హర వీరమల్లు’ 2వ రోజు వసూళ్లు ఎంతంటే
కానీ శోభన్ బాబు సున్నితంగా తిరస్కరించాడట. అనంతరం మురళీ మోహన్ కి కాల్ చేశారట. నేను ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ హీరోగానే ఉండిపోవాలి. శోభన్ బాబు అంటే హీరో అనే గుర్తుపెట్టుకోవాలి. ముసలి పాత్రలు నేను చేయను. మీ సంస్థ మంచిది, గతంలో సినిమాలు చేశాను. మీరు మంచి సినిమాలు చేస్తారు. కానీ క్యారెక్టర్ రోల్స్ చేయను, హీరోగానే చనిపోతాను, అన్నారట శోభన్ బాబు. ఈ విషయాన్ని మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.