https://oktelugu.com/

పాపం.. సీనియర్ హీరోకి నిర్మాణ కష్టాలు !

సీనియర్ హీరో డా. రాజశేఖర్ ఇప్పుడు ఏదో కామెడీ పీస్ అయిపోయాడు గాని, గతంలో రాజశేఖర్ కి కూడా ఇప్పుడు విజయ్ దేవరకొండ, నానికి ఉన్నంత క్రేజ్ ఉండేది. పైగా చిరు, బాలయ్య, నాగ్, వెంకీల తరువాత లిస్ట్ లో రాజశేఖర్ పేరే ముందుగా వినిపించేది. ఇండస్ట్రీలోని బంధుప్రీతి అనే ఐటమ్ రాజశేఖర్ కెరీర్ ను తెలియకుండానే బాగానే ఇబ్బంది పెట్టింది. మొత్తానికి ఏది అయితే ఏం హీరోగా ముప్పై ఏళ్ళు బండి నడిపించాడు రాజశేఖర్. ఇంకా […]

Written By:
  • admin
  • , Updated On : August 6, 2020 4:51 pm
    Follow us on


    సీనియర్ హీరో డా. రాజశేఖర్ ఇప్పుడు ఏదో కామెడీ పీస్ అయిపోయాడు గాని, గతంలో రాజశేఖర్ కి కూడా ఇప్పుడు విజయ్ దేవరకొండ, నానికి ఉన్నంత క్రేజ్ ఉండేది. పైగా చిరు, బాలయ్య, నాగ్, వెంకీల తరువాత లిస్ట్ లో రాజశేఖర్ పేరే ముందుగా వినిపించేది. ఇండస్ట్రీలోని బంధుప్రీతి అనే ఐటమ్ రాజశేఖర్ కెరీర్ ను తెలియకుండానే బాగానే ఇబ్బంది పెట్టింది. మొత్తానికి ఏది అయితే ఏం హీరోగా ముప్పై ఏళ్ళు బండి నడిపించాడు రాజశేఖర్. ఇంకా హీరోగానే కొనసాగడానికి కిందామీద పడుతున్నాడు.. పడి మళ్లీ లేవలేక లేపేవారి కోసం చూస్తున్నాడు. అయినప్పటికీ ఇంకా గట్టిగానే హీరో పాత్రల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన ‘గరుడవేగ’ హిట్ తో తెలుగు ప్రేక్షుకులకు తనలో మిగిలిపోయిన హీరోయిజాన్ని చూపించినా.. ఆ తరువాత కల్కి అంటూ చేతులెత్తేశాడు.

    Also Read: భార్య బాధితుడిగా రవితేజ !

    ఇక ప్రస్తుతానికి వస్తే.. రాజశేఖర్ తన తరువాత సినిమాని ‘పూలరంగడు, అహన పెళ్ళంట’ చిత్రాల డైరెక్టర్ వీరభద్రం చౌదరితో ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమాకి ఫైనాన్స్ సమస్య. ఎవరైనా డబ్బు పెడతారా అని చాలా రోజుల నుండి వెతుకుతున్నా, రాజశేఖర్ పై డబ్బు పెట్టే ఆ ప్రొడ్యూసర్ ఇంకా దొరకలేదు. అందుకే మనమే సినిమా చేద్దాం అని జీవితతో పదే పదే అంటున్నాడట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓన్ ప్రొడక్షన్ మంచింది కాదనేది జీవిత అభిప్రాయం. అలా అని సినిమా చేయకుండా ఇంట్లో కూర్చోమని రాజశేఖర్ తో చెప్పలేదు. కాబట్టి తమతో గతంలో సినిమాలు చేయటానికి వచ్చిన ప్రొడ్యూసర్ల లిస్ట్ తీసుకుని వారిని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక రాజశేఖర్ అయితే సినిమాలోని తన పాత్ర పై చాల సీరియస్ గా దృష్టి పెట్టాడట.

    Also Read: ఇండస్ట్రీలో ఉప్మా యవ్వారాల పై కరోనా చెక్ !

    ఇవ్వన్నీ బాగానే ఉన్నాయి గాని, అసలు వీరభద్రం చౌదరి అంటేనే ప్లాప్ లో ఉన్న డైరెక్టర్. మరి ఆయనను నమ్మి ఏ ప్రొడ్యూసర్ అయినా ఎందుకు కోట్లు పెడతాడు. పైగా సరికొత్త తరహా కథాంశంతో రానున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కోసం ఏ ప్రొడ్యూసర్ మాత్రం ఎందుకు రిస్క్ చేయాలనుకుంటాడు. అయితే సినిమాలో రాజశేఖర్ పాత్రకు ఆయన కూతురు పాత్రకు మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ చాలా బాగుంటాయని టాక్ ఉంది. కాకపోతే ఈ ఓటిటి జమానాలో ఇంకా పాత కాలం సెంటిమెంట్ ట్రాక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మరో సమస్య. మొత్తం మీద రాజశేఖర్ కి గరడవేగ తర్వాత మళ్ళీ అలాంటి చిత్రం రావాలంటే.. కచ్చితంగా విషయం ఉన్న డైరెక్టర్ పడాలి. ఈ వీరభద్రం చౌదరిలను నమ్ముకుంటే కష్టమే.