ఏపీ, తెలంగాణకు కేంద్రం మోసం

తెలుగు రాష్ట్రాలు విడిపోయి దాదాపు ఏడేండ్లు దగ్గరకు వస్తోంది. కానీ.. ఈ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న గొడవలను మాత్రం కేంద్రం పరిష్కరించడం లేదు. అంతేకాదు.. టైమ్‌పాస్‌ చేస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ఓ వైపు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్నప్పటికీ పరిష్కారానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సమైక్యాంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం నిర్ణయాలు తీసుకునేందుకు అప్పట్లో మూడు సమావేశాలు నిర్వహించారు. అయితే.. ఈ సమావేశాల బాధ్యత […]

Written By: Srinivas, Updated On : April 17, 2021 10:03 am
Follow us on


తెలుగు రాష్ట్రాలు విడిపోయి దాదాపు ఏడేండ్లు దగ్గరకు వస్తోంది. కానీ.. ఈ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న గొడవలను మాత్రం కేంద్రం పరిష్కరించడం లేదు. అంతేకాదు.. టైమ్‌పాస్‌ చేస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ఓ వైపు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్నప్పటికీ పరిష్కారానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

సమైక్యాంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం నిర్ణయాలు తీసుకునేందుకు అప్పట్లో మూడు సమావేశాలు నిర్వహించారు. అయితే.. ఈ సమావేశాల బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సమావేశాల్లో ఎవరి వాదనలు వారు వినిపించారు. ముఖ్యంగా సెక్షన్‌ 9, సెక్షన్‌ 10లలో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన జరగాల్సి ఉంది. ఈ సమావేశాల్లో ఎటూ తేలకముందే.. తెలంగాణ రాష్ట్రం ఓ అడుగు ముందుకేసి తనంతట తానుగా జీవోలు జారీ చేసింది. అక్కడ ఉన్న ఆస్తులన్నీ తెలంగాణవే అన్నట్లుగా తీర్మానించేసింది. ఆ వెంటనే ఏపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు కూడా ఈ వివాదాన్ని కేంద్రమే పరిష్కరించాలని సూచించింది.

అయితే.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటున్న సందర్భంలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెనక్కి తగ్గారు. దీంతో కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకొంది. అయితే.. హోం శాఖ కార్యదర్శులు సీనియర్టీ ప్రకారం ప్రతీ 9 నుంచి 10 నెలలకోసారి మారుతూనే ఉంటారు. ప్రతిసారీ వారికి సమస్యను చెప్పుకోవడం.. అది పరిష్కారానికి రాకముందే వారు వెళ్లిపోవడం జరుగుతున్న తంతు. మళ్లీ ఎవరు కొత్త కార్యదర్శి వస్తే వారి ముందుకు సమస్యను తీసుకెళ్లడం పరిపాటిగా మారింది. అయితే.. జగన్‌ సీఎం అయ్యాక కొన్ని వివాదాలు పరిష్కారం అయినా.. ఇంకొన్ని పెండింగ్‌లోనే ఉండిపోయాయి.

ఈ ఇరు రాష్ట్రాల వివాదంలో కేంద్ర హోం శాఖ ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరు సీఎంలు కూడా ఒప్పుకోకుండా ఉండరు. కానీ.. ఇక్కడ కేంద్రం కావాలనే నాన్చుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు కొత్త హోం సెక్రటరీ ఏర్పడింది. దానికి నాలుగు నెలల టైమ్‌ మాత్రమే ఉంది. ఈ క్రమంలో తొరగా సమావేశం ఏర్పాటు చేసి.. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే వివాదం సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ మళ్లీ ఎలక్షన్ల వరకూ ఈ విషయాన్ని ఇలాగే నాన్చి.. మరోసారి ఎన్నికల్లో లబ్ధి పొందే ఎత్తుగడ వేస్తోందని పలువురు నిపుణులు ఆరోపిస్తున్నారు. ప్పుడు ఒక వ్యక్తి కోసం తమ పని మానుకుని ఎదురుచూడటం అంటే.. అది ఎవ్వరూ మాత్రం ఎందుకు చేస్తారు.