కరోనా వచ్చిందని తీసేశారు.. అందులో తప్పేం ఉంది !

నటుడు ఆదర్శ్ బాలకృష్ణ విషయంలో జరిగింది కచ్చితంగా అన్యాయమే. అరె.. కరోనా కాలంలో ఒక నటుడికి కరోనా వచ్చింది. అతనికే కాదు ఇంట్లో ఉన్న అందరికి కరోనా సోకింది. మొత్తం కుటుంబం కష్టాల్లో ఉంది. ఆదర్శ్ తన తల్లితండ్రులను ఆసుపత్రిలో కూడా చేర్పించి.. వారికీ చికిత్స అందిస్తున్నాడు. ఇదే విషయాన్ని తాను నటిస్తున్న ఒక సినిమా యూనిట్ కి తెలిపడమే ఇప్పుడు అతను చేసిన పెద్ద తప్పు అయిపోయింది. ఎప్పుడైతే తనకు కరోనా అని ఆ చిత్రబృందానికి […]

Written By: admin, Updated On : April 17, 2021 9:45 am
Follow us on

నటుడు ఆదర్శ్ బాలకృష్ణ విషయంలో జరిగింది కచ్చితంగా అన్యాయమే. అరె.. కరోనా కాలంలో ఒక నటుడికి కరోనా వచ్చింది. అతనికే కాదు ఇంట్లో ఉన్న అందరికి కరోనా సోకింది. మొత్తం కుటుంబం కష్టాల్లో ఉంది. ఆదర్శ్ తన తల్లితండ్రులను ఆసుపత్రిలో కూడా చేర్పించి.. వారికీ చికిత్స అందిస్తున్నాడు. ఇదే విషయాన్ని తాను నటిస్తున్న ఒక సినిమా యూనిట్ కి తెలిపడమే ఇప్పుడు అతను చేసిన పెద్ద తప్పు అయిపోయింది. ఎప్పుడైతే తనకు కరోనా అని ఆ చిత్రబృందానికి ఆదర్శ్ చెప్పాడో.. ఇక ఆదర్శ్ బాలకృష్ణ చెయ్యాల్సిన ఆ పాత్ర నుంచి అతన్ని తొలగించి ఆ స్థానంలో ఇంకో నటుడ్ని తీసుకున్నారు ఆ చిత్రబృందం.

పైగా ఈ విషయాన్ని ఆదర్శ్ కి వాళ్ళు చెప్పనూ కూడా చెప్పలేదు. తన ప్లేస్ లో ఇంకొకర్ని తీసుకుంటున్న విషయాన్ని ఆ సినిమా దర్శకనిర్మాతలు తనకు చెప్పకపోవడం పై ఆదర్శ్ బాగా ఫీల్ అయినట్టు తెలుస్తోంది. కష్ట కాలంలో సాయం చేయాల్సింది పోయి.. పుండు మీద కారం చల్లినట్టు.. ఇలా తన పట్ల ఆ సినిమా టీం ప్రవర్తించడాన్ని ఆదర్శ్ భరించలేకపోతున్నాడట. నిజంగా ఈ సంఘటన సినిమా ఇండస్ట్రీలో చిన్న నటుల పరిస్థితి ఎలా ఉంటుందో చూపించింది. ఇక తన పట్ల జరిగిన ఈ దురదృష్టకరమైన సంఘటన గురించి ఆదర్శ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. తన ఫాలోవర్స్ తో పంచుకున్నాడు.

అయితే ఇక్కడ ఆ సినిమా టీమ్ నుండి మరో వివరణ వినిపిస్తోంది. సినిమాలో అందరి డేట్స్ ఉన్నాయని.. ఒక్క ఆదర్శ్ కోసం షూటింగ్ ను పోస్ట్ ఫోన్ చేసుకుంటే.. నిర్మాతకు నష్టాలూ మిగులుతాయని.. అందుకే ఆదర్శ్ ను తప్పించడం జరిగిందని చెబుతున్నారు. ఆ మాటకొస్తే.. పెద్ద హీరోలు, హీరోయిన్ల కోసం సినిమా నిర్మాతలు వెయిట్ చేస్తారు గాని, చిన్న నటుల విషయంలో కూడా వాళ్ళు అలాగే వెయిట్ చేయాలి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ప్రాక్టికల్ గా చెప్పాలంటే… చిన్న నటుల విషయంలో దర్శకనిర్మాతలకు చాల ఆప్సన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఒక వ్యక్తి కోసం తమ పని మానుకుని ఎదురుచూడటం అంటే.. అది ఎవ్వరూ మాత్రం ఎందుకు చేస్తారు.