Central Govt Focus On AP: ఏపీకి కేంద్రంలోని మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అడుగులు వేస్తోంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో ప్రపంచస్థాయి ఆహార ధాన్యాల నిల్వ సౌకర్యాన్ని కల్పించడానికి నడుం బిగించింది. వరల్డ్ లార్జెస్ట్ గ్రైన్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కింద తూర్పుగోదావరి జిల్లాలోని ఆచంట పీఏసీఎస్ ను ఎంపిక చేసింది.
ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. పెద్ద ఎత్తున ధాన్యం ఉత్పత్తులు ఇక్కడి నుంచి జరుగుతాయి. అందుకే మోడీ సర్కార్ ఏపీ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ధాన్యం, బియ్యం నిల్వలు చేసుకునేందుకు వీలుగా భారీ గోదాములు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకుగాను సహకార రంగాన్ని ఎంచుకుంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ఆహార ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డిసైడ్ అయ్యింది. ప్రయోగాత్మకంగా అచంట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని ఎంపిక చేసుకుంది. అక్కడ అత్యాధునిక గోదాములతో పాటు రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి తయారుచేసిన డిపిఆర్ ను కేంద్రం ఆమోదించింది. వాటి నిర్మాణానికి నిధులను సైతం మంజూరు చేసింది
ఆహార ధాన్యాల నిల్వ కోసం అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2.14 కోట్లు ఖర్చు చేయనున్నారు. రూ.86.20 కోట్ల అంచనా వ్యయంతో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గోదామును నిర్మించనున్నారు. రూ.1.12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గంటకు రెండు టన్నుల సామర్థ్యం తో కూడిన అత్యాధునిక కలర్స్ సార్తెక్ష్ రైస్ మిల్లును నిర్మించనున్నారు. యాన్సిలరీ, సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 14 లక్షల రూపాయల అంచనా వ్యయంతో విద్యుత్, అగ్నిమాపక సౌకర్యాలను కల్పించమన్నారు.
అచంట పి ఎస్ సి ఎస్ లో ఈ ప్రయోగం విజయవంతం అయితే మిగతా ప్రాథమిక పరపతి సహకార సంఘాలకు విస్తరించినన్నారు. ఎక్కడి ధాన్యం అక్కడే నిల్వలతో పాటు.. అదే రైస్ మిల్కు లేవీ ఇవ్వనున్నారు. దీంతో రైతుకు మద్దతు ధర కల్పించనున్నారు. స్థానికంగానే వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వీలుగా కేంద్రం సరికొత్త నిర్ణయానికి వచ్చింది. మొత్తానికైతే ఎన్నికల ముంగిట మోదీ సర్కార్ ఏపీకి ప్రత్యేకంగా బహుమానం ఇచ్చినట్టే.