అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 290 ఎలక్టోరల్ ఓట్లతో జో బైడెన్ గెలుపొందారు. అధ్యక్ష పదవికి 270 సీట్లు అవసరం ఉండగా బైడెన్ మేజిక్ ఫిగర్ దాటేశారు. అయితే కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదు. 11 రాష్ట్రాల్లో ఫలితాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ఇవి రావడానికి కనీసం మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ఇదే తరుణంలో ప్రస్తత అధ్యక్షుడు ట్రంప్ ఓటమిని ఒప్పుకోకుండా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఓ వైపు బైడెన్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతుండగా మరోవైపు ట్రంప్ అధికార మార్పిడికి ఒప్పుకోకుండా పోరాటం చేస్తానంటున్నారు.
Also Read: బైడెన్ తో బలపడనున్న భారత్–అమెరికా బంధం!
బైడెన్ కు మ్యాజిక్ ఫిగర్ ఓట్లు వచ్చిన వెంటనే ట్రంప్ సతీమణీ మెలానియా, కూతురు ఇవాంకలు మర్యాద పూర్వకంగా ఓటమిని ఒప్పుకోవాలని సూచించారు. అయితే కొడుకు లు జూరియన్, ఎరిక్ లు, అల్లుడు కుష్నర్ లు ట్రంప్ నకు మద్దతు పలికారు. ఎన్నికల్లో అక్రమాలపై ప్రజల్లోకి వెళ్తామని సూచించారు. ట్రంప్ వ్యవహార శైలిపై మీడియా కూడా సహకరించడం లేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ చేస్తున్న ప్రచారాన్ని చూపించడం లేదు. సోషల్ మీడియాలో సైతం బ్లూ మార్క్ పెట్టి ఇది అబద్దం అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ట్రంప్ వర్గం నేరుగా ప్రజల్లోకి వెళ్లి డెమొక్రట్లు ఎన్నికల్లో ఏ విధంగా అక్రమాలో చేశారో వివరించాలని నిర్ణయించుకున్నారు.
Also Read: అమెరికాలో తీవ్రమైన అల్లర్లు.. ట్రంప్ మద్దతుదారుల దాడులు..
ఈ మేరకు ట్రంప్ క్యాపెయిన్ డైరెక్టర్, వ్యక్తిగత లాయర్ టిమ్ మార్తోగ్ ధ్రువీకరించారు. ముందుగా తాను ఓట్లు కోల్పోయిన జార్జియా, పెన్విల్వేనియా, అరిజోనా లాంటి ప్రాంతాల్లో ర్యాలీలు తీయాలని నిర్ణయించారు. అయితే ఈ ర్యాలీల్లో ట్రంప్ నేరుగా కాకుండా ప్రతినిధులతో ప్రసగించే అవకాశం ఉంది. దీంతో ఒకవేళ పరిస్థితి తారుమారు అయితే ఎలా అని డెమొక్రటికన్లు ఆలోచనలో పడ్డారు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు