https://oktelugu.com/

ఆన్ లాక్ 2.0కు రెడీ అవుతున్న కేంద్రం..!

దేశంలోకి చైనా వైరస్ ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం లాక్డౌన్ 5.0(ఆన్ లాక్-1) కొనసాగుతోంది. ఈనెల 30వరకు ఆన్ లాక్1.0 కొనసాగనుంది. గడువు సమీపిస్తుండటంతో కేంద్రం ఆన్ లాక్ 2.0 అమలు చేసేందుకు సన్నహాలను చేస్తోంది. ఇప్పటికే ఆన్ లాక్ 2.0లో ఎలాంటి సడలింపు ఇవ్వాలనే వాటిపై కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆన్ లాక్ 1.0తో పోలిస్తే ఆన్ లాక్ 2.0లో పెద్దగా మార్పేమీ ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 27, 2020 2:52 pm
    Follow us on


    దేశంలోకి చైనా వైరస్ ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం లాక్డౌన్ 5.0(ఆన్ లాక్-1) కొనసాగుతోంది. ఈనెల 30వరకు ఆన్ లాక్1.0 కొనసాగనుంది. గడువు సమీపిస్తుండటంతో కేంద్రం ఆన్ లాక్ 2.0 అమలు చేసేందుకు సన్నహాలను చేస్తోంది. ఇప్పటికే ఆన్ లాక్ 2.0లో ఎలాంటి సడలింపు ఇవ్వాలనే వాటిపై కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆన్ లాక్ 1.0తో పోలిస్తే ఆన్ లాక్ 2.0లో పెద్దగా మార్పేమీ ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    దేశంలో ఇప్పటికే 5లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే భారత్ కరోనా కేసుల్లో నాలుగో స్థానానికి చేరుకుంది. దేశంలో రోజురోజుకు కేసులు సంఖ్య భారీగా పెరగడమే తప్ప తగ్గడం లేదు. వాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచిస్తుంది. మరోవైపు రాష్ట్రాలకు కరోనా సడలింపులపై కేంద్రం అధికారాన్ని కట్టబెట్టింది. దీంతో రాష్టాలు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

    మోడీ దెబ్బకు.. నల్లధనం ఖతం..

    పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు రాష్ట్రాలు కొన్ని ఏరియాల్లో పూర్తిగా లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. తమిళనాడు, ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఆయా ప్రభుత్వాలు పూర్తి లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణలోనూ కొన్ని గ్రామాల్లో స్వచ్ఛంధంగా లాక్డౌన్ పాటిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ఏరియాల్లో వ్యాపారులు వారంపాటు స్వచ్చంధంగా మార్కెట్లను బంద్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.

    కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆన్ లాక్ 2.0లో కేంద్రం పెద్దగా మార్పులేమీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఇటీవల ప్రారంభమై రైలు సర్వీసులను త్వరలో నిలిపివేయనున్నట్లు రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. అలాగే అంతర్జాతీయ విమాన సర్వీసులు వచ్చే నెల 15వరకు రద్దు చేస్తున్నట్లు విమాన శాఖ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆగస్టు వరకు విద్యాసంస్థలు తెరిచే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో విద్యాసంస్థల యాజమానులు ఆన్లైన్ క్లాసులవైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఆయా రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలను, సీబీఎస్సీ 10, 12తరగతుల పరీక్షలు కూడా రద్దు చేశాయి. మహానగరాల్లో మెట్రో సర్వీసులు ప్రారంభమ్యే అవకాశం కన్పించడం లేదని ప్రచారం జరుగుతోంది.

    ‘బీహార్‌ ఎన్నికల కోసం బీజేపీ గల్వాన్‌ నాటకం!’

    ఈనేపథ్యంలో ఆన్ లైన్ 2.0 సేమ్ టూ సేమ్ ఆన్ లాక్ 1.0లా ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం దాదాపు అన్నిరంగాలకు సడలింపులు ఇచ్చింది. అయితే కొన్నిరంగాలు మాత్రం వందకు పైగా రోజులపాటు లాక్డౌన్లోనే ఉన్నాయి. దీంతో ఈ రంగాలకు ఊరట కలిగించేలా కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా? అనేది మాత్రం మరో రెండుమూడ్రోజుల్లో తేలిపోవడం ఖాయంగా కన్పిస్తోంది.