కరోనా మహమ్మారి సంక్షోభంలో ఇప్పటికే షూటింగ్స్ లేక సినీ కార్మికులు ఆర్ధిక ఇబ్బందులతో అతలాకుతలం అయిపోతున్నా పరిస్థితులను గమనించి.. సినీ పెద్దలు ‘కరోనా క్రైసిస్ చారిటీ’ పెట్టి సాయం అందించారు. ఈ విషయంలో మెగాస్టార్ ని అలాగే ఫండ్స్ ఇచ్చిన బాలయ్య, ప్రభాస్, ఎన్టీఆర్, నాగార్జున లాంటి హీరోలను అభినందించాలి. అయితే, సాయం కేవలం ఫిల్మ్ కి సంబంధించి ఏదొక అసోసియేషన్ లో మెంబర్ అయినవాళ్లకు మాత్రమే అందింది. కానీ నిజానికి సినిమాలకు పని చేసే వాళ్లల్లో కొంతమందికి ఎలాంటి మెంబర్ షిప్ ఉండదనేది నిజం. దాంతో మెంబర్ కాని వాళ్లకు ఎలాంటి సాయం అందలేదు. షూటింగ్స్ జరిగితేనే వాళ్లకు రోజులు గడుస్తాయని అని వాళ్ళు అసోసియేషన్స్ కు ఎంత చెప్పుకున్నా.. అసోసియేషన్స్ కు నాయకులం అంటూ అధికారం చలాయిస్తోన్న కొంతమంది డబ్బా రాయుళ్లు వారికి సాయం అందకుండా చేస్తున్నారు.
ఆన్ లాక్ 2.0కు రెడీ అవుతున్న కేంద్రం..!
పైగా ‘కరోనా క్రైసిస్ చారిటీ’కి తప్పుడు లెక్కలు చూపించి.. సరుకులను దారి మళ్లిస్తున్నారని ఇండస్ట్రీలోని కొంతమంది కార్మికులు చెప్పుకుంటున్న సంఘటనలు కూడా వినిపిస్తున్నాయి. సరే ఇండస్ట్రీ పక్కన పెడితే మీడియా వారికీ కూడా సాయం అందిస్తున్నారు. కానీ ఎన్నో ఏళ్ళ నుండి మీడియాలో పని చేస్తోన్న వారికి ఎలాంటి సాయం అందడం లేదు. మీడియాలో కూడా మెంబర్ షిప్ ఉంటేనే సాయం అని ఖరాఖండిగా చెబుతున్నారు. చాల మందికి ఎలాంటి మెంబర్ షిప్ లేదు. కారణం వారి పనిచేస్తోన్న సంస్థలు వారికి మెంబర్ షిప్ ఇచ్చేలా చూసుకోవాలి. కానీ ఎన్ని సంస్థలు అలా చేస్తున్నాయి..? అంటే సమాధానం లేదు.
పవన్ మౌనం.. పార్టీని దెబ్బతీస్తుందా?
మొత్తానికి ఏ క్రాఫ్ట్ లో మెంబర్ కాని వేల మంది సినీ కార్మికులకు ఎలాంటి సాయం అందకా, ఎలాంటి ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం ‘కరోనా క్రైసిస్ చారిటీ’ పెద్దలకు చేరాలని కోరుకుందాం. ఇప్పటికే వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సంపాదనకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేకపోవడంతో కొంతమందికి పస్తులతో పడుకునే పరిస్థితి ఉంది.
కాబట్టి మెగాస్టార్ సారథ్యంలో నడుస్తోన్న కరోనా క్రైసిస్ చారిటీ అలాంటి మెంబర్ కానీ సినీకార్మికుల్ని గుర్తించి ఆదుకుంటే ఇన్నాళ్లు చేసిన సాయానికి నిజమైన విలువ ఉంటుంది. మెగాస్టార్ మెంబర్ కాని కార్మికులను ఆదుకోండి.