అక్టోబర్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్..!

ప్రకటన కంపెనీలకు కేంద్రం షాకిచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు ప్రకటనలు, అడ్వర్టైజ్ మెంట్లకు సంబంధించి రూల్స్ మార్చేందుకు రెడీ అవుతోంది. ఈమేరకు సెప్టెంబర్ 18లోపు సలహాలు, సూచనలు అందించాలని సంబంధిన కమిటీని కోరింది. ఇందులో వచ్చిన సూచనలు, సలహాలను, అభ్యంతరాలను పరిశీలించిన తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 1నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నహాలు చేస్తోంది. Also Read: చైనా దుస్సాహాసం.. భారత్ ను హెచ్చరిస్తున్న మీడియా ఇందుకోసం కేంద్రం కన్సూమర్ […]

Written By: NARESH, Updated On : September 9, 2020 11:23 am
Follow us on

ప్రకటన కంపెనీలకు కేంద్రం షాకిచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు ప్రకటనలు, అడ్వర్టైజ్ మెంట్లకు సంబంధించి రూల్స్ మార్చేందుకు రెడీ అవుతోంది. ఈమేరకు సెప్టెంబర్ 18లోపు సలహాలు, సూచనలు అందించాలని సంబంధిన కమిటీని కోరింది. ఇందులో వచ్చిన సూచనలు, సలహాలను, అభ్యంతరాలను పరిశీలించిన తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 1నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నహాలు చేస్తోంది.

Also Read: చైనా దుస్సాహాసం.. భారత్ ను హెచ్చరిస్తున్న మీడియా

ఇందుకోసం కేంద్రం కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019కింద సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ)ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. దీని ప్రకారంగా కంపెనీల ప్రకటనల్లో ఇకపై పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం కుదరదని తెలుస్తోంది. అలాగే ప్రమాదకరమైన సన్నివేశాల్లో పిల్లలు నటించడానికి కూడా వీల్లేకుండా నిబంధనలు రూపొందిచినట్లు తెలుస్తోంది.

పిల్లలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇకపై చేయకుండా చర్యలు తీసుకోనుంది. ఆల్కహల్, పొగాకు సంబంధింత ఉత్పత్తి ప్రకటనల్లో పిల్లలు కనిపించకుండా చర్యలు తీసుకోనుంది. ప్రొడక్టులను సంబంధించి అతి ప్రచారం చేయకుండా నిబంధనలు సవరించనుంది. ప్రకటనల్లో నటించే సెలబ్రెటీలు సైతం ఆయా కంపెనీలు, ప్రొడక్టులపై తీసుకోవాలని సూచించింది. లేకుంటే వారికి కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది.

Also Read: బ్రేకింగ్:భారత్-చైనా బలగాల మధ్య కాల్పులు!

అంతేకాకుండా ప్రకటనల్లో డిస్‌క్లైమర్ కచ్చితంగా కనిపించేలా చర్యలు తీసుకోనుంది. ఇప్పటి వరకు అతిగా డిస్ క్లైమర్ ఉండేది. ఇకపై అలాంటివి కుదరదు. స్పష్టంగా కంటికి కన్పించేలా ఉండాలని కేంద్రం స్పష్టం చేస్తోంది. అలా లేకుండా రూల్స్‌ను అతిక్రమించినట్లే చెబుతోంది. యాడ్ ఏ భాషలో ఉందో డిస్‌క్లైమర్ కూడా అదే భాషలో ఉండాలని కేంద్రం మార్గదర్శకాలను రూపొందిస్తోంది. కేంద్రం తాజా నిబంధనలు ప్రకటనల కంపెనీలకు షాకిచ్చేలా కన్పిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీనిపై ప్రకటనల కంపెనీలు ఎలా ముందుకెళుతాయో వేచి చూడాల్సిందే..!