ప్రపంచాన్ని ఓ ఆట ఆడేసిన కరోనా.. సెకండ్ వేవ్ కూడా స్టార్టయింది. ఇప్పటికే కరోనాతో దేశాలన్నీ అల్లకల్లోలం అయ్యాయి. లాక్‌డౌన్‌లు విధించి ఆర్థికంగా కుదేలయ్యాయి. సెకండ్ ప్రమాదం పొంచి ఉండడంతో.. డిసెంబర్ ఒకటి నుంచి రాష్ట్రాల్లో రాత్రిల్లో కర్ఫ్యూ పెట్టుకునేందుకు కేంద్రం హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. లాక్‌డౌన్ అమలు చేయాలంటే మాత్రం కేంద్రం అనుమతి తప్పనిసరి అని అందులో పేర్కొంది.
Also Read: జగన్ కు కేంద్రం షాక్: దోస్తీ అంటూనే ఫుట్ బాల్ ఆడేస్తున్నారు
డిసెంబరు 31 వరకు మార్గదర్శకాలు అమలులో ఉండబోతున్నాయి. శీతాకాలంలో ప్రారంభం కావడంతో కోవిడ్ కేసులు పెరగటానికి అవకాశాలు ఉండటంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలువుతున్నాయి. దేశ వ్యాప్తంగా అమలు చేయటానికి వీలుగా మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ కర్ఫ్యూ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. మాస్కులు ధరించటం.. భౌతికదూరం పాటించటం.. చేతుల్ని శుభ్రంగా కడుక్కోవటం లాంటి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని.. పబ్లిక్ ప్లేసుల్లో మాస్కు ధరించని వారికి జరిమానా విధించాలని పేర్కొంది.
అంతేకాదు.. వైరస్ వ్యాప్తికి కారణమైన వారి విషయంలోనూ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మరీ ముఖ్యంగా ఆఫీసుల్లో మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించాలని ఆదేశించింది. ఆరోగ్య సేతు యాప్ ను విధిగా అందరూ వినియోగించాలన్న ప్రభుత్వం.. కంటైన్మెంట్ జోన్ వెలుపల సినిమా హాళ్లు 50 శాతం సీటింగ్‌తో నిర్వహించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. స్విమ్మింగ్ ఫూల్స్ అనుమతిని క్రీడాకారుల శిక్షణ నిమిత్తం మాత్రమే ఇవ్వటం గమనార్హం.
Also Read: భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి మాత్రం..?
కరోనా పాజిటివ్ పర్సన్‌ను గుర్తించిన తర్వాత కాంటాక్ట్ లోకి వచ్చిన వారి వివరాలను సేకరించాలని.. వారిని గుర్తించి క్వారంటైన్ చేయాలంది. 72 గంటల్లో కనీసం 80 శాతం పూర్తి చేయాలని సూచించింది. వారంలో పాజిటివ్ కేసులు పదిశాతానికి మించితే.. ఆఫీసులకు హాజరయ్యే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు.. సామాజిక దూరాన్ని పాటించేందుకు వీలుగా ఆఫీసు టైమింగ్స్ ను మార్చాలని కేంద్రం స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్