జగన్ కు అనుకూలంగా సుప్రీం మరో ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సుప్రీం కోర్టు మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అమరావతి భూముల కుంభకోణం విషయంలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ విచారణపై ఏపీ హైకోర్టు జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్ ను సుప్రీం కోర్టు ఎత్తేసింది. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్రావు వ్యవహారంలో సుప్రీం కోర్టు జగన్ చర్యలను సమర్థించింది. ఏబీ వెంకటేశ్వర్రావు పై సస్పెన్షనల్ ను అమలు చేయకుండా ఏపీ హైకోర్టు ఇదివరకు జారీ […]

Written By: Velishala Suresh, Updated On : November 26, 2020 3:37 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సుప్రీం కోర్టు మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అమరావతి భూముల కుంభకోణం విషయంలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ విచారణపై ఏపీ హైకోర్టు జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్ ను సుప్రీం కోర్టు ఎత్తేసింది. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్రావు వ్యవహారంలో సుప్రీం కోర్టు జగన్ చర్యలను సమర్థించింది. ఏబీ వెంకటేశ్వర్రావు పై సస్పెన్షనల్ ను అమలు చేయకుండా ఏపీ హైకోర్టు ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. తనను సస్పెండ్ చేస్తూ జగన్ ప్రభుత్వం జారీ చేసి ఆదేశాలపై వెంకటేశ్వర్రావు ఏపీ హైకోర్టులో సవాల్ చేస్తూ పిల్ వేశారు. దీంతో వెంకటేశ్వర్ రావును విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది. విచారణను స్వీకరించిన కోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే జారీ చేసింది.