తెలంగాణకు కేంద్రం కీలక సూచనలు

దేశంలోని రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. కొన్నిరోజులుగా దేశంలో రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేసులు సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారులతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ తాజాగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని జన సాంద్రత […]

Written By: Neelambaram, Updated On : June 9, 2020 12:32 pm
Follow us on


దేశంలోని రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. కొన్నిరోజులుగా దేశంలో రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేసులు సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారులతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ తాజాగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని జన సాంద్రత ఎక్కువగా ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారు. అవసరమైన పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలున్న వారికి విడిగా చికిత్స అందించాలని కోరారు.

లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆయా రాష్ట్రాల అప్రమత్తంగా ఉండాలన్నారు. కంటైన్మెంట్ జోన్లు,బఫర్ జోన్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులకు సూచించారు. ఇంటింటి సర్వే నిర్వహించి రోగులను గుర్తించాలన్నారు. టెస్టు ఫలితాలు త్వరగా వచ్చేలా చూడాలన్నారు. బాధితులకు అన్నిరకాల వైద్య సేవలు అందించి మరణాలను తగ్గించేలా చూడాలని కోరారు. అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.

ఇంటింటా సర్వే నిర్వహించేందుకు తగిన సంఖ్యలో టీములను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం తీసుకోవాలని కోరారు. బఫర్‌ జోన్ల పరిధిలో జ్వరం, జలుబు, శ్వాసకోశ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారిని గుర్తించి వారికి వేరుగా చికిత్స అందించాలన్నారు. బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించడంపై దృష్టిసారించాలని ఆయన సూచించారు.