https://oktelugu.com/

ప్రవీణ్ ప్రకాష్ విశాఖ పర్యటనకు కారణం ఇదే..!

రాష్ట్ర రాజధాని తరలింపునకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో విశాఖ నగరంలో సీఎంఓ, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి స్థల పరిశీలన చేయడం చర్చనీయాంశంగా మారింది. సీఎంఓ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, సెంట్రల్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సీఈపీటీ) ప్రెసిడెంట్ బిమల్ పటేల్ కలిసి విశాఖ సాగర తీరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. రాజధానిని తరలించేందుకు ఖరారు చేసిన […]

Written By: , Updated On : June 9, 2020 / 12:09 PM IST
Follow us on


రాష్ట్ర రాజధాని తరలింపునకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో విశాఖ నగరంలో సీఎంఓ, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి స్థల పరిశీలన చేయడం చర్చనీయాంశంగా మారింది. సీఎంఓ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, సెంట్రల్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సీఈపీటీ) ప్రెసిడెంట్ బిమల్ పటేల్ కలిసి విశాఖ సాగర తీరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు.

రాజధానిని తరలించేందుకు ఖరారు చేసిన రెండు ముహుర్తాలు కరోనా కారణంగా దాటిపోయాయి. శార్వారి నామ ఉగాది, మే 28వ తేదీలు రాజధానిని విశాఖ తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైనా కరోనా ఉధృతి, లాక్ డౌన్ వల్ల వెనక్కి తగ్గింది. ఏదేమైనా రాజధాని తరలించాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. వైసీపీ నేతల రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యలలో ఇదే విషయం స్పష్టమవుతోంది. అక్టోబర్ నెలలో విజయదశమి రోజున తరలించేందుకు తాజాగా ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ ముహూర్తాన్ని విశాఖ సరదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి నిర్ణయించారని వాదనలు ఉన్నాయి.

మరోవైపు రాజధాని తరలింపు విషయంలో రైతులు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణ లో ఉంది. పాలనా వికేంద్రీకరణ బిల్లుకు అనుమతి లభించే వరకూ రాజధాని తరలించమని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఈ క్రమంలో కోర్టులో వ్యవహారం తేలే వరకూ వేచి ఉండకుండా ప్రభుత్వం విశాఖలో రాజధానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటూ పోతుంది. ఇప్పటికే సీఎంఓ కార్యాలయ ఫర్నిచర్ విశాఖ నగరానికి తరలించి భద్రపరిచారు. ఇప్పుడు శాశ్వత భవనాలకు స్థల పరిశీలనలతో రాజధాని తరలింపులో ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని స్పష్టమవుతోంది.