
వ్యాక్సిన్లు ఏవీ? ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న వేళ అందరి చూపు వ్యాక్సిన్ల వైపే. పైగా ఇప్పటికే మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోస్ అందింద్దామంటే కూడా వ్యాక్సిన్లు లేక కాన కష్టం అవుతోంది. మోడీపై అన్ని వైపులా నుంచి వ్యాక్సిన్ల ఒత్తిడి తీవ్ర మవుతున్న వేళ తాజాగా ఒక గుడ్ న్యూస్ అందింది.
ఇప్పటికీ దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా మరో వైపు వ్యాక్సినేషన్ మాత్రం మందకొడిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉంది. ఇక అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్టడంతో వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.
అయితే తాజాగా వ్యాక్సిన్ పై కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లోనే 51 లక్షల వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటిదాకా కేంద్రం 20 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు ఉచితంగా అందజేసింది. మే 14వ తేదీ వరకు 18.43 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించారు. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1.84 కోట్ల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డోసులే లేవు. దీంతో మూడు రోజుల్లోనే 51 లక్షల డోసులను రాష్ట్రాలకు ఇవ్వడానికి కేంద్రం రెడీ అయ్యింది.