https://oktelugu.com/

ఏపీలో కొత్త జిల్లాలు 32? నివేదికలోని అంశాలివీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఎన్ని ఉండనున్నాయి.. వైసీపీ ఎన్నికల హామీ మేరకు 25 జిల్లాలు వస్తాయా..? 32 వస్తాయా అని చర్చ జరుగుతోంది. రెవెన్యూ శాఖ 28 జిల్లాలపైనే ఉండొచ్చని భావిస్తోంది. గిరిజన లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న సంక్లిష్టతే ఇందుకు ప్రధాన కారణమని చెబుతోంది. ఫలితంగా 3 గిరిజన జిల్లాల ఏర్పాటు అనివార్యమవుతోందని తెలిపింది. ఎన్నికల సమయంలో వైసీపీ ఇచ్చిన హామీ మేరకు జగన్‌ ప్రభుత్వం కొలువుతీరిన తొలిరోజు నుంచే రెవెన్యూశాఖ ఈ అంశంపై […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2020 7:24 pm
    Follow us on

    AP New Districts

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఎన్ని ఉండనున్నాయి.. వైసీపీ ఎన్నికల హామీ మేరకు 25 జిల్లాలు వస్తాయా..? 32 వస్తాయా అని చర్చ జరుగుతోంది. రెవెన్యూ శాఖ 28 జిల్లాలపైనే ఉండొచ్చని భావిస్తోంది. గిరిజన లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న సంక్లిష్టతే ఇందుకు ప్రధాన కారణమని చెబుతోంది. ఫలితంగా 3 గిరిజన జిల్లాల ఏర్పాటు అనివార్యమవుతోందని తెలిపింది. ఎన్నికల సమయంలో వైసీపీ ఇచ్చిన హామీ మేరకు జగన్‌ ప్రభుత్వం కొలువుతీరిన తొలిరోజు నుంచే రెవెన్యూశాఖ ఈ అంశంపై దృష్టిసారించింది.

    Also Read: అవినీతిని ప్రశ్నించిన వైసీపీ కార్యకర్తను చంపిన వైసీపీ నేతలు!

    కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందే గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్ల పునర్విభజన చేపట్టాల్సి ఉంటుందని రెవెన్యూ శాఖ నివేదికలో పేర్కొంది. కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలు 2 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. వాటిల్లోని మండలాలను సమంగా రెవెన్యూ డివిజన్లకు పంపిణీ చేయాలి. ఇది జరగాలంటే తొలుత మండలాలు, ఆపై డివిజన్ల పునర్విభజన చేపట్టాలి. రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్త గా మరో 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. పునర్విభజన ప్రభావం 35 డివిజన్లపై ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్నాక చివరగా 11 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 679 మండలాలున్నాయి. విభజన ప్రక్రియ కోసం 12 మండలాలను పునర్విభజించాలి.

    *సీఎస్‌ కమిటీ నియామకం
    కొత్త జిల్లాలపై సీఎస్‌ నేతృత్వంలో కమిటీ నియామకాన్ని కేబినెట్‌ ఆమోదించింది. ఏపీ జిల్లాల ఏర్పాటు చట్టం-1974 ప్రకారం.. కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్‌ ఇస్తారు. 30 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వీటిని కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. కొత్త జిల్లాల ముఖచిత్రం ఎలా ఉండాలి.. జిల్లా ప్రధాన కేంద్రంగా ఏ పట్టణం ఉండాలో కమిటీ ఖరారు చేస్తుంది. జనాభా లెక్కల నేపథ్యంలో జిల్లాల సరిహద్దులు మార్చకూడదన్న ఫ్రీజింగ్‌ ఉత్తర్వులు ఉన్నాయి.

    Also Read: విపత్తు సాయం: తెలంగాణకు హ్యాండిచ్చిన మోడీ

    *నివేదికలో అంశాలు
    -అరకు నియోజకవర్గాన్ని మూడు గిరిజన జిల్లాలు.. పార్వతీపురం, అరకు, రంపచోడవరంగా విభజించవచ్చు.
    -శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలోని పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను పార్వతీపురం జిల్లాగా చేసే అవకాశం ఉంది.
    -విశాఖలోని అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలను అరకు జిల్లాగా చేయవచ్చు.
    -తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రత్యేక గిరిజన జిల్లాగా ఏర్పాటుచేసే అవకాశం ఉంది.
    – ఏలూరు నియోజకవర్గాన్ని రెండుగా విభజించి పోలవరం నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్