Homeజాతీయ వార్తలుMedicines: సొంతంగా మందులు వాడుతున్నారా... ఇవి ప్రమాదకరం.. 156 రకాల మెడిసిన్లపై కేంద్రం నిషేధం!

Medicines: సొంతంగా మందులు వాడుతున్నారా… ఇవి ప్రమాదకరం.. 156 రకాల మెడిసిన్లపై కేంద్రం నిషేధం!

Medicines: ఇంట్లో ఎవరికైనా జలుబైందా.. వెంటనే సిట్రజిన్‌ వేయండి.. జ్వరం వచ్చిందా.. ప్యారా సిటమాల్‌ లేదా డోలో 650 వేసేయ్‌.. ఒళ్లు నొపుపలు ఉన్నాయి.. ఫలానా గోలీ వేసుకో.. ఇలా చాలా మంది ఇప్పుడ సలహాలు ఇస్తున్నారు. ఒకప్పుడు అనారోగ్యం బారిన పడితే నాటువైద్యం చేసేవారు. ఇప్పుడు కూడా నెట్టింటి వైద్యం చేస్తున్నారు. చేసుకుంటున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. పెరిగిన వైద్య ఖర్చులు.. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్యం అందకపోవడం వంటి కారణాలతో చాలా మంది సొంత వైద్యానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా సొంత వైద్యం చాలా ప్రమాదకరమని వైద్యులు, ఫార్మా కంపెనీల నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందులపై కూడా డాక్టర్‌ సూచన మేరకే వాడాలని సూచిస్తున్నారు. కానీ, చాలా మంది చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు సొంత వైద్యానికే ప్రిఫరెన్స్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం మందుల ధరలను కూడా తగ్గించింది. జనరిక్‌ మెడిసిన్స్‌ను పేదలకు తక్కువ ధరకు అందిస్తోంది. అయినా చాలా మంది హెవీ డోస్‌ మెడిసిన్లు వేసుకుంటున్నారు. ఈ కారణంగా కూడా కొత్త వ్యాధులు వస్తున్నట్లు భారత వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫార్మా స్యూటికల్‌ కంపెనీలకు పెద్ద షాక్‌ ఇచ్చింది. 156 ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మందుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ముప్పు ఉందనే బ్యాన్‌..
కాంబినేషన్‌ మెడిసిన్స్‌ వాడడం వలన ప్రజలకు ముప్పు తెచ్చే అవకాశం ఉందనే కారణంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిషేధిత మెడిసిన్‌లో జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు వాడే మందులు కూడా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సురక్షితమైన మందులు ఉండగా.. కాంబినేషన్‌ డ్రగ్స్‌ను వాడటం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుందని కేంద్రం వెల్లడించింది. ఏది పడితే ఆ మెడిసిన్‌ వేసుకుని ఉన్న రోగం నయం కావడం పక్కన పెడితే.. లేని కొత్త రోగాన్ని కొని తెచ్చుకోవడమే అని డాక్టర్లు, ప్రభుత్వాలు ఎప్పుడూ చెబుతూనే ఉంటాయి. సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువగా ఉంటాయని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు ముప్పు తీసుకువచ్చే అవకాశం ఉన్న మందులను బ్యాన్‌ చేసింది.

నిషేధిత మందులు కొన్ని..
ఎసెక్లోఫెనాక్‌ 500 ఎంజీ + పారాసెటమాల్‌ 125 ఎంజీ కాంబినేషన్‌.. మెఫెనమిక్‌ యాసిడ్‌ + పారాసెటమాల్‌ ఇంజెక్షన్‌ కాంబినేషన్‌.. సెట్రిజెన్‌ హెచ్‌సీఎల్‌+ పారాసెటమాల్‌+ ఫినైలెప్రైన్‌ హెచ్‌సీఎల్‌ కాంబినేషన్‌.. లెవొసెట్రిజిన్‌+ ఫినైలెప్రైన్‌ హెచ్‌సీఎల్‌+ పారాసెటమాల్‌ కాంబినేషన్‌ వంటి ఎక్కువగా వినియోగించే మందులు కూడా కేంద్ర ప్రభుత్వ నిషేధిత ఔషధాల జాబితాలో ఉన్నాయి. వీటిని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 12వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version