Centre Bans PFI: భారత దేశంలో అల్లర్లు సృష్టించడంతోపాటు, ప్రాధాని నరేంద్రమోదీ, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతల హత్యకు కుట్ర పన్నిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ)పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్లు నిషేధం విధించింది. ఈమేరకు కేంద్ర హోం శాఖ గెజిట్ విడుదల చేసింది. దీంతో పీఎఫ్‌ఐ కథ ముగిసినట్లే అని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ 2006లో ఏర్పాటయింది. మొదట కేరళలో ప్రారంభమై.. ఆ తర్వాత దేశమంతటా విస్తరించింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. కొన్ని రోజులుగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై దృష్టిపెట్టిన కేంద్ర నిఘా వరాగలు.. భారీ కుట్రను భగ్నం చేశాయి. ఆ సంస్థతో సంబంధం ఉన్నవారిని అరెస్ట్ చేశాయి. ఈ నేపథ్యంలో సంస్థతోపాటు దాని అనుబంధ సంస్థలను నామరూపాలు లేకుండా చేసేందుకు యూఏపీఏ కింద కేంద్ర హోంశాఖ నిషేధం విధించింది. పీఎఫ్‌ఐతోపాటు దాని అనుబంధ సంస్థలైన సీఎఫ్‌ఐ, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్, రిహాబ్ ఇండియా ఫౌండేషన్, నేషనల్ ఉమెన్ ఫ్రంట్ సంస్థలను కూడా చట్ట విరుద్ధమైన సంస్థలుగా ప్రకటించింది. ఇకపై మనదేశంలో ఈ సంస్థలు ఎలాంటి కార్యకలాపాలు చేయడానికి వీల్లేదు.
మైనారిటీల సాధికారత పేరుతో..
మైనారిటీలు, దళితులు, అణగారిన వర్గాల సాధికారతే లక్ష్యంగా పనిచేయనున్నట్లు పీఎఫ్‌ఐ ప్రకటించింది. అందుకోసం సామాజిక ఉద్యమాన్ని నడుపుతున్నట్లు వెల్లడించింది. కానీ ఈ ముసుగులో రాడికల్ ఇస్లాంను ప్రచారం చేస్తోందని భద్రతా సంస్థలు గుర్తించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు పిలుపునివ్వడం, హింసాత్మక ఘటనలకు పాల్పడడం, కరాటే పేరుతో యువతకు ఉగ్రవాద శిక్షణ ఇవ్వడం, అమాయక యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు ప్రోత్సహించడం.. వంటి కార్యకలాపాలు చేస్తున్నట్లు పీఎఫ్‌ఐపై ఆరోపణలున్నాయి.
ఎన్‌ఐఏ మెరుపు దాడులు..
సెప్టెంబరు 22న ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో ఎన్‌ఐఏ (కేంద్ర దర్యాప్తు సంస్థ).. పీఎఫ్‌ఐపై మెరుపు దాడులు చేసింది. ఏపీ, తెలంగాణ , కర్నాటక, తమిళనాడు , కేరళ , మహారాష్ట్ర , ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ , జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, అసోం, బీహార్, రాజస్థాన్‌సహా మొత్తం 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. పీఎఫ్‌ఐ కార్యాలయాలు, నేతలు, కార్యకర్తల ఇళ్లల్లో సోదాలు చేసి.. దాదాపు వంద మందికిపైగా అరెస్ట్ చేసింది. సోదాల్లో ల్యాప్‌టాప్స్, పెన్‌డ్రైవ్స్ సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నేతల విచారణలో కీలక వివరాలను రాబట్టారు. అస్సాంలో 25 మందిని, మహారాష్ట్రలో నలుగురు, ఢిల్లీలో 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 21 మందిని, గుజరాత్‌లో 10 మందిని, కర్ణాటకలో కూడా చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.

దసరా సందర్భంగా ప్రముఖుల హత్యకు స్కెచ్..
పీఎఫ్‌ఐ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి స్కెచ్ వేసినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. అదుపులోకి తీసుకున్న పీఎఫ్‌ఐ ప్రతినిధులు విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఇందులో దేశ ప్రధాని నరేంద్రమోదీ హత్యకు పీఎఫ్‌ఐ కుట్ర చేసినట్లు తేలింది. దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలను హతమార్చడం ద్వారా అల్లర్లు సృష్టించాలని భావించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్‌లో జరిపిన దాడుల్లో అదుపులోకి తీసుకున్నవారి ద్వారా ఈ విషయాలు బయటపడినట్లు తెలిసింది. మొత్తంగా అనేక విచారణలు, నిఘావర్గాల సమాచారం తర్వాత కేంద్ర హోంశాఖ పీఎఫ్‌ఐతోపాటు, దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధించడం కాస్త ఊరటనిచ్చింది.
[…] Also Read: Centre Bans PFI: కేంద్రం సంచలన నిర్ణయం.. పీఎఫ్‌ఐ… […]
[…] Also Read: Center Bans PFI: Centre’s sensational decision… PFI work report… Banned for five y… […]