Mahesh Babu Daughter Sitara Crying: సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి మరణం వారి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇందిరాదేవి (70) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఆమె తుదిశ్వాసన విడిచారు.

ఈ ఏడాది జనవరిలోనే మహేష్ సోదరుడు రమేశ్ బాబు మరణించడం.. ఇప్పుడు తల్లి కూడా చనిపోవడంతో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. మహేష్ కు తల్లి ఇందిరాదేవిపై అపురూపమైన ప్రేమ. పలు సందర్భాల్లో ఆమె ప్రస్తావన రాగానే ఎంతో ఎమోషనల్ అయ్యేవాడు. పెళ్లికి ముందు వరకూ తల్లితోనే ఉన్నాడు. అందుకే ఆమె అంటే ఎంతో ప్రేమ.
ఇక మహేష్ కే కాదు.. ఆయన కూతురు సితారకు కూడా నానమ్మ ఇందిర అంటే పంచప్రాణాలు. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా నానమ్మ ఇంటికెళ్లి ఆమె ఆడుతూ పాడుతూ ఉండేది. ఇందిరాదేవి కన్నుమూయడంతో ఆమె మనవరాలైన మహేష్ కూతురు సితార తట్టుకోలేకపోతోంది.

ఇందిరాదేవి భౌతికకాయం వద్ద మహేష్ పై కూర్చొని నానమ్మను గుర్తు చేసుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది. మహేష్ ఆమెను ఎంత ఓదార్చినా సితార దు:ఖం ఆపుకోలేకపోయింది. నానమ్మ అంటే ఆమెకు ఎంత ప్రేమ అని.. ఆమె మరణాన్ని సితార జీర్ణించుకోవడం లేదని తెలుస్తోంది.
Also Read: Indira Gandhi- Bathukamma: బతుకమ్మతో ఇందిరాగాంధీ…. రేర్ ఫోటో వైరల్.. ఎప్పుడు ఎక్కడ ఇదీ.!…
[…] […]
[…] Also Read: Mahesh Babu’s Daughter Sitara Crying: Video: Sitara cried bitterly.. Mahesh, Namrata consoled […]