Narendra Modi Birthday: నరేంద్ర మోడీ తన జన్మదిన వేడుకలను హంగూ ఆర్భాటల మధ్య జరుపుకోవడం లేదు. గతంలో మాదిరే ఈసారి కూడా ఆయన ప్రజాసేవలోనే నిమగ్నమయ్యారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ ఒడిశాలో పర్యటిస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు అక్కడ పలు ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తున్నారు. ప్రధాని జన్మదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. “భారత జాతి ముద్దుబిడ్డ, దూర దృష్టిగల నాయకుడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు.. భారతదేశాన్ని బలంగా, సంపన్నంగా నిర్మించాలనే మీ దూర దృష్టి అందరి మనసులలో ప్రతిబింబిస్తోంది. అంకితభావంతో మీరు దేశానికి మరింత సేవ చేయాలి. భారతదేశాన్ని పట్టిష్టం చేయాలి. భవిష్యత్తు కాలానికి అభివృద్ధి చేసి చూపించాలి. ఇతర తరాలకు ప్రేరణగా నిలవాలని” పలువురు ట్వీట్లు చేశారు. రాష్ట్రపతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బిజెపి నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా ప్రధానమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.. మోడీ చేపడుతున్న వినూత్న పథకాలు..తీసుకున్న నిర్ణయాలు భారతదేశంలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయని కొనియాడారు.
అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారంటే..
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ” మోడీ నాయకత్వం బలమైనది. ఆయన దార్శనికత చాలా గొప్పది. భారత్ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఆయనను కొనియాడుతోంది. దూర దృష్టి, బలమైన నాయకత్వం గల నాయకుడు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఏకాగ్రతతో వినూత్న విధానాలకు శ్రీకారం చుడుతున్నారని.. ఆయన విధానాలు దేశ శ్రేయస్సుకు తోడ్పడుతున్నాయని” రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..” ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు.. ఆయన ఆరోగ్యంగా ఉండాలి. ఆయన నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అని” ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా నరేంద్ర మోడీకి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..” మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో.. వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని” ఆయన తన ట్వీట్లో వెల్లడించారు.. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నదానం, పరిసరాల పరిశుభ్రత, వస్త్ర దానం, దివ్యాంగులకు పరికరాల దానం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానమంత్రి జన్మదిన పురస్కరించుకొని సేవా దినంగా భావించి.. పలు కార్యక్రమాలను నిర్వహించాలని బిజెపి నాయకులు ముందుగానే ప్రకటించారు. అందుకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं। आपने अपने व्यक्तित्व एवं कृतित्व के बल पर असाधारण नेतृत्व प्रदान किया है तथा देश की समृद्धि और प्रतिष्ठा में वृद्धि की है। मेरी कामना है कि आपके द्वारा राष्ट्र प्रथम की भावना से किए जा रहे अभिनव…
— President of India (@rashtrapatibhvn) September 17, 2024